
పది రోజులుగా భారీ వర్షాలకు తడిసి ముద్దయిన రాష్ట్రానికి మరో అల్పపీడన ప్రభావం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 11న ఉత్తన మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంది. 12 నుంచి తిరిగి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావంతో ఆదిలాబాద్, కుమ్రంబీం, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు తప్పవని పేర్కొంటూ ఎల్లో హెచ్చరిక జారీ చేసింది.