
ఏపీలో పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థుల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు. దీనికోసం ఆయుష్ శాఖ ద్వారా మందు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రాజెక్టు అమృత్ పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమంలో ఆర్సెనిక్ ఆల్బమ్ 30సి మందును విద్యార్థులకు పూర్తి ఉచితంగా అందిస్తామని చెప్పారు.