Gautam Gambhir: ఈ ఓటములతో ఎన్నో సంవత్సరాల చరిత్రను టీమిండియా కోల్పోవాల్సి వచ్చింది. ముఖ్యంగా న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ కు గురి కావడంతో టీమ్ ఇండియా పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అది కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ముందు జరగడంతో ఆరోపణలు తన స్థాయిని దాటిపోతున్నాయి. అయితే జాతీయ మీడియాలో వస్తున్న విశ్లేషణాత్మక కధనాల ప్రకారం టీమిడియా కోచ్ గౌతమ్ గంభీర్ పై సీనియర్ ఆటగాళ్లు ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. అతని వ్యూహాలతో ఏకీభవించటం లేదని సమాచారం. దీనిపై బీసీసీఐకి కొంతమంది ఆటగాళ్లు ఫిర్యాదు చేశారు.. అయితే స్వదేశంలో న్యూజిలాండ్ జట్టు చేతిలో వైట్ వాష్ కు టీమిండియా గురైన నేపథ్యంలో.. ఆ దారుణమైన పరాజయానికి గౌతమ్ గంభీర్ ను బాధ్యుడిని చేసే ప్రణాళిక విజయవంతంగా అమలవుతున్నది. అయితే ఈ వివాదం గౌతమ్ గంభీర్ కోచ్ పదవికి ఎర్త్ పెట్టేలా ఉంది. ఇదే జరిగితే తెలుపు, ఎరుపు రంగు బంతులకు వేరువేరు శిక్షకులను నియమించే ఆలోచనలో బీసీసీఐ ఉందని తెలుస్తోంది.
91 సంవత్సరాల చరిత్రలో..
91 సంవత్సరాల భారత క్రికెట్ చరిత్రలో స్వదేశంలో మూడు అంతకంటే ఎక్కువ మ్యాచ్ ల సిరీస్ ను 0 -3 తేడాతో ఎప్పుడూ కోల్పోలేదు. అయితే ఆ దారుణమైన ఓటమితో టీమిండియా పరువు తీసుకుంది. ప్రపంచ దేశాల ఎదుట దోషిగా నిలబడింది.. అయితే ఈ పరాజయం పై బీసీసీఐ లోతుగా పరిశీలన చేస్తోంది. ముఖ్యంగా గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ , సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ ను బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా కీలక ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది.
ఎవరిని అడిగి తప్పించారు..
న్యూజిలాండ్ జట్టుతో పూణేలో జరిగిన రెండో టెస్ట్ లోనూ టీమ్ ఇండియా దారుణంగా విఫలమైంది. ఈ క్రమంలో మూడో టెస్ట్ కోసం స్పిన్ వికెట్ ఎందుకు తయారు చేశారని సెలక్షన్ కమిటీ ప్రశ్నించింది.. ఇదే సమయంలో గౌతమ్ గంభీర్ పై టీ మీడియా మేనేజ్మెంట్ కు అనేకమంది ఫిర్యాదు చేశారు. గౌతమ్ గంభీర్ ప్రణాళికలతో తాము విభేదిస్తున్నామని వారు పేర్కొన్నారు. ఇదే విషయాన్ని జాతీయ మీడియా ప్రధానంగా ప్రసారం చేసింది. ఐతే ఆ ఆటగాళ్లు ఎవరనే విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. ఈ క్రమంలో గౌతమ్ గంభీర్ కు నవంబర్ 22 నుంచి మొదలయ్యే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి అవకాశం అని తెలుస్తోంది. ఇదే విషయాన్ని బీసీసీఐ పెద్దలు అతడికి తేల్చి చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ టీమ్ ఇండియా ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ లో రాణించకపోతే.. రెడ్ బెల్ ఫార్మాట్ లో కొత్త నియమించే అవకాశం కనిపిస్తోంది. అతడి స్థానంలో వివిఎస్ లక్ష్మణ్ కు అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. లక్ష్మణ్ మాత్రమే కాకుండా సీనియర్ ఆటగాళ్లపై కూడా వేటు విధిస్తారని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే న్యూజిలాండ్ జట్టుతో ఓటమి టీమ్ ఇండియాలో పెను ప్రకంపనలకు కారణమవుతోంది.