
కేంద్ర ప్రభుత్వం కొత్త ఐటీ చట్టాలను అములోకి తెచ్చిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా నియంత్రణ కోసం ఆ రూల్స్ ను రూపొందించారు. ఈ నేపథ్యంలో దీనిపై ట్విట్టర్ సంస్థ స్పందించింది. భారత్ లో ఉన్న చట్టాలకు లోబడే పనిచేయనున్నట్లు ట్విట్టర్ పేర్కొన్నది. భారత ప్రభుత్వంలో నిరంతరం సమగ్రపూర్వక చర్చలు నిర్వహించనున్నట్లు చెప్పింది. కానీ ఇటీవల ఢిల్లీలోని గురుగ్రామ్ లో జరిగిన కొన్ని ఘటనల పై ట్విట్టర్ ఆందోలన వ్యక్తం చేసింది. స్వేచ్చాయుత ఐటీ రూల్స్ కు అనుగుణంగా తమ కార్యచరణ ఉంటుందని ట్విట్టర్ వెల్లడించింది.