
ఐపీఎల్ కోసం ఇంగ్లాండ్ పర్యటన నుంచి యూఏఈకి ఇంత త్వరగా రావడం దురదృష్టకరమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. జట్టు బృందంలో కొందరికి కరోనా సోకడంతో అలాంటి పరిస్థితులు వచ్చాయి. ఏ సమయంలో ఏదైనా జరగొచ్చు. ఐపీఎల్ లో బయో బబుల్ అత్యంత సురక్షితంగా ఉంటుందని భావిస్తున్నా. నాణ్యమైన టోర్నీని చూస్తామని ఆశిస్తున్నా అని కోహ్లీ చెప్పాడు.