
సీఎం కేసీఆర్ నేడు యాదాద్రి పర్యటనకు రానున్నారు. మధ్యాహ్నం 1 గంటకు స్వామి స్వయంభూ దర్శనం కల్పించే ప్రధాన ఘట్టంలోని తుదిదశ పనులను పరిశీలించనున్నారు. అనంతరం మార్పులు-చేర్పులపై అధికారులతో చర్చిస్తారు. అక్టోబర్ లేదా నవంబర్ మాసంలో ఆలయం ప్రారంభించాలని భావిస్తుండటంతో పనులు వేగంగా పూర్తిచేయాలని సూచించనన్నారు. ఈనెల 17న చినజీయర్ స్వామితో కలిసి మరోసారి సీఎం కేసీఆర్ యాదాద్రిలో పర్యటించనున్నారు.