Homeక్రీడలుIshan kishan : ఇషాన్ కిషన్ రాంపేజ్.. పాక్ కు భారీ టార్గెట్

Ishan kishan : ఇషాన్ కిషన్ రాంపేజ్.. పాక్ కు భారీ టార్గెట్

Ishan kishan : టి20 వరల్డ్ కప్ లో భాగంగా కొలంబో వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా పాకిస్తాన్ ఎదుట టీమిండియా భారీ లక్ష్యాన్ని ఉంచింది.. బౌలింగ్ కు పూర్తిగా సహకరించే ఈ మైదానంలో టీమిండియా బ్యాటర్లు అంతగా సత్తా చూపించలేకపోయారు…

ప్రమాదకరమైన ఆటగాడు అభిషేక్ శర్మ (0) డక్ ఔట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా కూడా 0 పరుగులకే వెనుతిరిగాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్(77) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. తిలక్ వర్మ (25), సూర్య కుమార్ యాదవ్ (32), శివం దుబే (27) సమయోచితంగా బ్యాటింగ్ చేయడంతో టీమిండియా 7 వికెట్లు నష్టానికి 175 పరుగులు చేసింది.

అభిషేక్ శర్మ విఫలమైనప్పటికీ ఇషాన్ కిషన్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. పాకిస్తాన్ బౌలర్ల పై సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. అతడు ఉన్నంత సేపు టీమ్ ఇండియా స్కోర్ బోర్డు రాకెట్ వేగంతో దూసుకుపోయింది. తద్వారా పాకిస్తాన్ బౌలర్లు చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. సెంచరీ చేస్తాడు అనుకుంటున్న క్రమంలో కిషన్ అవుట్ అయ్యాడు. అతడు అవుట్ అయిన తర్వాత టీమ్ ఇండియా స్కోర్ బోర్డు లో వేగం తగ్గింది.

మైదానం పూర్తిగా బౌలర్లకు సహకరిస్తున్న నేపథ్యంలో టీమిండియా ప్లేయర్లు సమయోచితంగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. తద్వారా భారత్ స్కోరు వేగంగా పరుగులు పెట్టలేకపోయింది. అయితే మధ్య మధ్యలో సూర్య కుమార్ యాదవ్ తనదైన షాట్లు ఆడాడు. తిలక్ వర్మ కూడా తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు. ఇక చివర్లో శివం దూబే దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో టీమిండియా 175 పరుగులు చేసింది.

పాకిస్తాన్ బౌలర్లలో ఆయుబ్ మూడు వికెట్లు పడగొట్టాడు. సల్మాన్ ఆగా, ఆఫ్రిది, ఉస్మాన్ తారిఖ్ తలా ఒక వికెట్ సాధించారు. తొలి ఓవర్లో వికెట్ కోల్పోయిన టీమ్ ఇండియా.. ఆ తర్వాత పాకిస్తాన్ బౌలర్లకు అలాంటి అవకాశం ఇవ్వలేదు. ఇషాన్ కిషన్ దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో.. టీమిండియా స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అయితే అతడు గనుక అవుట్ అవ్వకుండా ఉండి ఉంటే టీమిండియా ఇంకా భారీ స్కోర్ చేయగలిగేది. పాకిస్తాన్ ముందు కొండంత లక్ష్యాన్ని విధించేది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular