ప్రముఖ రచయిత రమణ గోపిశెట్టి దర్శకుడిగా అరంగేట్రం చేస్తోన్న హై ఇంటెన్స్ యాక్షన్, థ్రిల్లింగ్ డ్రామా తత్వమసి. ఇందులో `రోగ్` ఫేమ్ ఇషాన్, వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సినిమా టైటిల్..కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ ను ఈ రోజు విడుదలచేసింది చిత్ర యూనిట్. తత్వమసి.. అనేది అద్వైత సాంప్రదాయం నుండి వచ్చిన సంస్కృత మంత్రం. ఈ పదానికి `సర్వము నేనే` అనే అర్ధం వస్తుంది. ప్రాచీన హిందూ గ్రంథాలైన ఉపనిషత్తుల నుండి వచ్చిన నాలుగు సూత్రాలైన మహావాక్యాలలో తత్వమసి ఒకటి. ఇది ఆత్మ లేదా ఐక్యతను సూచించడానికి ఉపయోగించబడుతుంది.
టైటిల్ ని బట్టి ఇదోక యూనిక్ కథాశం అని అర్థమవుతోంది. ఈ సినిమా ఒక ప్రత్యేకమైన కథాంశంతో లార్జర్ దేన్ లైఫ్ తరహాలో తెరకెక్కుతోంది. కాన్సెప్ట్ పోస్టర్ టైటిల్ ఆసక్తిని కలిగిస్తున్నాయి. టైటిల్ లోగోపై రక్తపు మరకలతో ఇది జాతక చక్రం(కుండలి) తరహాలో రూపొందించారు.
మోషన్ పోస్టర్ సినిమా ఎలా ఉండబోతుందో అనేది రివీల్ చేసింది. “మానవజాతి చరిత్రలో ఎన్నడూ లేనిది. నిరంతర శక్తి. హద్దులేని భావోద్వేగం. ప్రతీకార ఆనందం కోసం సాక్ష్యంగా నిలవండి“ అని మోషన్ పోస్టర్ ద్వారా తెలిపారు మేకర్స్. టైటిల్ క్యూరియాసిటీని పెంచగా.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రూపొందిన మోషన్ పోస్టర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. తత్వమసి తెలుగు, తమిళ, మలయాళ మరియు హిందీ భాషల్లో ప్యాన్ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఈ సినిమా చిత్రీకరణకు అంతా సిద్దమైంది. తత్వమసి న్యూ ఏజ్ స్టోరీతో తప్పకుండా ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరచనుంది. విలక్షన నటులు ప్రకాశ్‌రాజ్, హరీష్ ఉత్తమన్ కీలక పాత్రల్లో నటించనున్నారు.
RES ఎంటర్టైన్మెంట్ LLP పతాకంపై రాధాకృష్ణ తేలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సామ్ సిఎస్ ట్యూన్స్ -బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేయగా.. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్. ప్రముఖ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ ఈ చిత్రానికి స్టంట్స్ సమకూరుస్తున్నారు. చంద్రబోస్ లిరిక్స్ అందిస్తున్నారు. ఇతర తారాగణం సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
తారాగణం: ఇషాన్, వరలక్ష్మీ శరత్‌కుమార్, ప్రకాశ్‌రాజ్, హరీష్ ఉత్తమన్
సాంకేతిక వర్గం:
రచన,దర్శకత్వం: రమణ గోపిశెట్టి
నిర్మాత: రాధాకృష్ణ తేలు
బ్యానర్: RES ఎంటర్టైన్మెంట్ LLP
సంగీతం: స్యామ్ సీఎస్
డిఓపి: శ్యామ్ కె నాయుడు
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
లిరిక్స్: చంద్రబోస్
స్టంట్స్: పీటర్ హెయిన్స్
పిఆర్ఓ: వంశీ- శేఖర్
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Ishaan varalakshmi sharatkumar tatvamasi movie announcement
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com