Isha Movie Box Office Collections : ఈ ఏడాది టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధికంగా జోరు చూపించినవి చిన్న సినిమాలు మాత్రమే. ఎలాంటి హడావిడి లేకుండా విడుదలై, బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతూ బయ్యర్స్ జోబులో బోలెడంత డబ్బులను నింపాయి ఈ చిన్న సినిమాలు. అలా ఈ క్రిస్మస్ కి ఏకంగా నాలుగు చిన్న సినిమాలు విడుదల అయ్యాయి. వాటిల్లో హారర్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ‘ఈషా'(Isha Movie) చిత్రం కూడా ఉంది. ఈ సినిమాకు విడుదలకు ముందు కాస్త హైప్ వచ్చిన విషయం వాస్తవమే. ఎందుకంటే చాలా కాలం తర్వాత వస్తున్నా హారర్ చిత్రం. ఇలాంటి సినిమాలకు థియేట్రికల్ అనుభూతి గొప్పగానే ఉంటుంది అనేది ప్రేక్షకులు అభిప్రాయం. థియేట్రికల్ ట్రైలర్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం, విడుదల తర్వాత మాత్రం మొదటి ఆట నుండే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది.
ఓవరాల్ గా నాలుగు రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి నాలుగు రోజుల్లో 5 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. షేర్ వసూళ్లు దాదాపుగా 2 కోట్ల 85 లక్షలు ఉంటాయట. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి నాల్గవ రోజున తెలుగు రాష్ట్రాల నుండి 85 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 90 లక్షలు వరకు ఉంటుందని అంచనా. అంటే షేర్ దాదాపుగా 45 లక్షల వరకు ఉండొచ్చు అన్నమాట. ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే, కచ్చితంగా ఈ చిత్రం నాల్గవ రోజున రాబట్టిన ఆ గ్రాస్ వసూళ్ళలో కనీసం 40 శాతం అయినా రాబట్టాలి. అప్పుడే ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ వరల్డ్ వైడ్ గా 6 కోట్ల రూపాయలకు జరిగినట్టు తెలుస్తోంది. నేటి తో కలిపి ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 3 కోట్ల రూపాయిల షేర్ మార్కుని దాటింది అనుకుందాం, ఇంకో మూడు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తే సూపర్ హిట్ అన్నట్టు. మరి ఆ రేంజ్ ని అందుకోవాలంటే కచ్చితంగా ఈ చిత్రం వర్కింగ్ డేస్ లో డీసెంట్ స్థాయి హోల్డ్ ని సాధించాలి. న్యూ ఇయర్ రోజున ఎలాగో మంచి వసూళ్లు వస్తాయి కాబట్టి, కచ్చితంగా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుందని బలంగా చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. చూడాలి మరి అది ఎంత వరకు నిజం అవుతుంది అనేది.