
కరోనా కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన ఐపీఎల్ 14వ సీజన్ ను సెప్టెంబర్- అక్టోబర్ లో యూఏలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు అది పూర్తైన వెంటనే టీ 20 ప్రపంచకప్ ను కూడా అక్కడే నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ తాజాగా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ లో మిగిలిన మ్యాచ్ లు నిర్వహించేసరికే అక్కడి పిచ్ లు దెబ్బతింటాయని దక్షిణాఫ్రికా కోచ్ మార్క్ బౌచర్ ఆందోళన వ్యక్తం చేశాడు. బ్యాట్స్ మెన్ కు పరుగులు చేయడం ఇబ్బందిగా మారి స్పిన్నర్లకు కలిసివస్తుందని అతడు అభిప్రాయపడ్డాడు.