ప్చ్.. నిర్మాతల పరిస్థితి ఇంకా అగమ్యగోచరమే !

ఆంధ్రలో కోవిడ్ కేసులు తగ్గుతున్నాయి. థియేటర్లు ఓపెన్ చేయడానికి ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. అయితే ఆగస్టు నుండి మూడో వేవ్ వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఇప్పుడు తెరుచుకునే థియేటర్లు మళ్ళీ ఎప్పుడు మూత బడతాయో తెలియదు. దీనికితోడు ఇంకా కేసులు నమోదు అవుతున్నాయి. ప్రతి జిల్లాలో కనీసం వందల కేసులు తక్కువ లేకుండా ఉంటున్నాయి, తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి వుంది. మరి ఇలాంటి నేపథ్యంలో సినిమాలను ఏ నమ్మకంతో రిలీజ్ కి […]

Written By: admin, Updated On : July 5, 2021 4:25 pm
Follow us on

ఆంధ్రలో కోవిడ్ కేసులు తగ్గుతున్నాయి. థియేటర్లు ఓపెన్ చేయడానికి ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. అయితే ఆగస్టు నుండి మూడో వేవ్ వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఇప్పుడు తెరుచుకునే థియేటర్లు మళ్ళీ ఎప్పుడు మూత బడతాయో తెలియదు. దీనికితోడు ఇంకా కేసులు నమోదు అవుతున్నాయి. ప్రతి జిల్లాలో కనీసం వందల కేసులు తక్కువ లేకుండా ఉంటున్నాయి, తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి వుంది.

మరి ఇలాంటి నేపథ్యంలో సినిమాలను ఏ నమ్మకంతో రిలీజ్ కి సిద్ధం చేయాలి ? అసలు వచ్చే నెలలో విడుదలవుతున్న సినిమాల పరిస్థితే లాటరీ లాంటిది. పైగా రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలు మంచి అంచనాలు ఉన్నవి. ముందుగా రిలీజ్ అయ్యే సినిమాల లిస్ట్ లో శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ, ఆపై వారంలో టక్ జగదీష్, తలైవా, విరాటపర్వ లాంటి సినిమాలు వున్నాయి.

మరి ఇప్పుడున్నట్టు కేసులు ఇంకా రోజురోజుకు పెరిగిపోతూ ఉంటే ఏమి చేయాలి ? సరే సినిమాల విడుదల ఆగిపోతే అది వేరే సంగతి. అలా కాకుండా సినిమాలు విడుదల తరువాత సడెన్ గా కేసులు పెరిగి జనం థియేటర్స్ కి రాకపోతే ? అసలుకే ఏపీలో ఫిఫ్టీ పర్సంట్ ఆక్యుపెన్సీ నిబంధన పెట్టారు. అంటే, కలెక్షన్స్ లోనే సగం పోయినట్లు. మరోపక్క కరోనాకు భయపడి జనంలో కొంతభాగం థియేటర్స్ వైపు చూడరు.

మరి ఇలాంటి క్లిష్ట సమయంలో సినిమా రిలీజ్ చేసి ప్లాప్ టాక్ తెచ్చుకున్నా.. లేక రిలీజ్ చేసి కలెక్షన్స్ రాబట్టలేక లాస్ అయినా ఓటీటీలో కూడా ఆయా సినిమాలకు ఏ మాత్రం డిమాండ్ ఉండదు. ఇవన్నీ నిర్మాతలు ఆలోచించుకున్నారు కాబట్టే.. ఎవరూ ముందుకు వచ్చి తమ సినిమా రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేయడం లేదు. ఏది ఏమైనా టాలీవుడ్ నిర్మాతల పరిస్థితి అగమ్యగోచరంగానే ఉంది, ఈ కరోనా ఇంకా వారిని కలవరపెడుతూనే ఉంది.