IPL 2026 : మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ మినీ వేలం జరగనుంది. 2026 సీజన్ కు సంబంధించి అనేక జట్లు కొంతమంది ప్లేయర్లను తమ వద్ద ఉంచుకోగా.. మిగతా వారిని వదిలించుకున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే మినీ వేలం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. 2025 ఐపీఎల్ ను పరిగణలోకి తీసుకుంటే.. పది జట్లకు ఎటువంటి ప్లేయర్లు కావాలో అభిమానులకు ఒక అంచనా ఏర్పడింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో తమ తమ అభిప్రాయాలను వారు వ్యక్తం చేస్తున్నారు. వారు వ్యక్తం చేసిన అభిప్రాయాల ప్రకారం ఏ జట్టుకు ఎలాంటి ఆటగాళ్లు కావాలో తెలిపే కథనమిది.
చెన్నై సూపర్ కింగ్స్
ఐపీఎల్ లో ఐదుసార్లు విజేతగా నిలిచిన ఈ జట్టుకు ఇప్పుడు బలమైన, దూకుడయిన ఓపెనర్ కావాలి. మిడిల్ ఆర్డర్లో అర్థవంతమైన బ్యాటర్ ఉండాలి. అదే స్థాయిలో ఆల్రౌండర్లు కూడా ఉండాలి. స్పిన్నర్లు, పేస్ బౌలర్లు కూడా జట్టులో ఉండాలి.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
ఈ జట్టు 2025లో విజేతగా నిలిచింది. అయినప్పటికీ కొన్ని కొన్ని లోపాలు ఈ జట్టను వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ జట్టుకు బ్యాకప్ స్పిన్నర్ చాలా అవసరం. మిడిల్ ఆర్డర్లో బలమైన ఆల్ రౌండర్ అవసరం. ఇండియన్ బ్యాక్అప్ పేసర్ కావాలి. బ్యాకప్ ఓపెనర్ కూడా ఉండాలి.
ముంబై ఇండియన్స్
ఐదుసార్లు విజతగా నిలిచిన ఈ జట్టుకు మిడిల్ ఓవర్లు వేయగల సమర్థవంతుడైన బౌలర్ కావాలి. డెత్ ఓవర్లను వేసే స్పెషలిస్ట్ బౌలర్ కావాలి. సమర్థవంతుడైన ఓపెనర్ తో పాటు బ్యాకప్ ఓపెనర్ కూడా కావాలి. స్పిన్ బౌలర్ కూడా ఈ జట్టుకు అవసరం.
హైదరాబాద్
సమర్థవంతమైన మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కావాలి. అనుభవజ్ఞుడైన స్పిన్నర్ కూడా ఉండాలి. ముఖ్యంగా పవర్ ప్లేలో సత్తా చూపించే పేస్ బౌలర్ చాలా అవసరం. బ్యాక్అప్ ఓపెనర్ కూడా ఉండాలి.
పంజాబ్ సూపర్ కింగ్స్
ఈ జట్టుకు ఇండియన్, ఓవర్సీస్ స్పిన్నర్లు అవసరం. ఇండియన్ పేస్ బౌలర్లు మరింత అవసరం. బ్యాక్అప్ ఓపెనర్ కూడా ఉండాలి. అన్నింటికి మించి ఈ జట్టుకు సమర్థవంతుడైన ఆల్రౌండర్ అవసరం.
కోల్ కతా నైట్ రైడర్స్
ఈ జట్టుకు సమర్థవంతుడైన ఓపెనింగ్ బ్యాటర్ అవసరం. పేస్ బౌలింగ్ తో పాటు ఆల్ రౌండర్ నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు కావాలి. ఫాస్ట్ బౌలింగ్ వేసే బౌలర్లు చాలా అవసరం. బంతులను వేగంగా వమెలి తిప్పగల సామర్థ్యం ఉన్న స్పిన్ బౌలర్లు అవసరం.
గుజరాత్
మిడిల్ ఆర్డర్లో సత్తా చూపించగల సామర్థ్యం ఉన్న బ్యాటర్లు అవసరం. చివరి ఓవర్లను సమర్ధవంతంగా వేసే బౌలర్ ఈ జట్టుకు కావాలి. బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ చేసే ఆల్ రౌండర్ ఈ జట్టుకు చాలా అవసరం. ముఖ్యంగా ఓవర్సీస్ పేసర్ ఈ జట్టుకు అత్యంత ముఖ్యం.
రాజస్థాన్ రాయల్స్
టాపార్డర్లో సమర్థవంతులైన బ్యాటర్ కావాలి. భారతీయ స్పిన్నర్, పేస్ బౌలర్లు ఈ జట్టుకు చాలా అవసరం. ఓవర్సీస్ ఫినిషర్ కావలసి ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో ఆల్రౌండర్ లు ఈ జట్టుకు అత్యంత అవసరం.
ఢిల్లీ క్యాపిటల్స్
ఈ జట్టుకు దూకుడైన టాపార్డర్ బ్యాటర్ కావాలి. చివరి ఓవర్లలో ఫినిషింగ్ ఇవ్వగల బ్యాటర్ అవసరం. అనుభవం ఉన్న పేస్ బౌలర్ కావాలి. పేస్ బౌలింగ్ లో ఆల్ రౌండర్ కూడా ఈ జట్టుకు అవసరం.
లక్నో
ఈ జట్టుకు టాప్ ఆర్డర్ బ్యాటర్ కావలసి ఉంది. లోయర్ ఆర్డర్ విభాగంలో ఫినిషింగ్ బ్యాటర్ కావాలి. అన్నింటికంటే ముఖ్యంగా పేస్ బౌలింగ్లో సత్తా చూపించగలిగే భారత బౌలర్ కావాలి. దీంతోపాటు ఆల్ రౌండర్ కూడా ఈ జట్టుకు చాలా అవసరం.