Shaheen Shah Afridi : క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్.. ఈ ఆటలో స్ఫూర్తి మాత్రమే ఉండాలి. పోటీ తత్వం మాత్రమే కనపడాలి.. అలాకాకుండా ప్రత్యర్థులపై కోపం, కసి, కావాలని ఇబ్బంది పెట్టడం వంటివి ప్రదర్శిస్తే.. అది ఆటగాడికి తీవ్రమైన ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. మైదానంలో క్షణకాలంలో కలిగే ఉద్రేకం జీవితకాలం ప్రభావాన్ని చూపిస్తుంది. సరిగ్గా ఇటువంటి ఇబ్బందిని పాకిస్తాన్ బౌలర్ షాహిన్ షా అఫ్రిది ఎదుర్కొంటున్నాడు.
అఫ్రిది ప్రస్తుతం బిగ్ బాష్ లీగ్ లో ఆడుతున్నాడు. బ్రిస్బేన్ హీట్ జట్టు తరఫున ఇతడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. బిగ్ బాష్ లీగ్ లో భాగంగా బ్రిస్బేన్, మెల్బోర్న్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.. ఈ మ్యాచ్ గీలాంగ్ వేదికగా జరిగింది. ముందుగా మెల్బోర్న్ జట్టు బ్యాటింగ్ చేస్తుంది. ఆ జట్టు 18 ఓవర్లో ఆఫ్రిది బౌలింగ్ వేశాడు. రెండు బంతులను బ్యాటర్ నడుము ఎత్తువరకు ఫుల్ టాస్ లు వేశాడు. ఈ రెండు బంతులను టీం సిఫర్డ్, ఓలీ పీక్ ఎదుర్కొన్నారు. అయితే ఈ బంతులు అత్యంత ప్రమాదకరంగా ఉండడంతో కెప్టెన్ నాథన్ మెక్ స్వీని చివరి రెండు బంతులు వేశాడు.. దీంతో బౌలర్ ఆఫ్రిది వంకరగా నవ్వాడు.
అఫ్రిది బిబిఎల్ ప్రారంభంలో 2.4 ఓవర్ల పాటు బౌలింగ్ వేశాడు. మూడు నోబాల్స్, రెండు వైడ్లు వేశాడు. మొత్తంగా 43 పరుగులు ఇచ్చాడు. అయితే ఇదే లీగ్ లో మహమ్మద్ రిజ్వాన్ కూడా ఆడుతున్నాడు. ఇతడు మెల్బోర్న్ జట్టు తరుపున ఆడుతున్నాడు. అతడు మొదట్లో బౌలింగ్ బాగానే వేసినప్పటికీ.. ఆ తర్వాత దిగజారిపోయాడు. ఇక ఈ మ్యాచ్లో మెల్బోర్న్ ఐదు వికెట్లకు 212 పరుగులు చేసింది. సీ ఫెర్డ్ 102, పీక్ 57 పరుగులు చేశారు. రిజ్వాన్ మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి పది పంతులు ఎదుర్కొని కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేశాడు.
Wow.
On his BBL debut, Shaheen Afridi has been removed from the attack! #BBL15 pic.twitter.com/IhDLsKFfJi
— KFC Big Bash League (@BBL) December 15, 2025