- Telugu News » Ap » Investigation into irregularities in ap fiber net
ఏపీ ఫైబర్ నెట్ లో అక్రమాలపై దర్యాప్తు
ఇప్పటికే పలు కేసులతో బిజీగా ఉన్న సీఐడీ అధికారులకు మరో కేసు వచ్చిపడింది. ఏపీ ఫైబర్ నెట్ లో అక్రమాల ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. గతంలో గుత్తేదారుకు అనుకూలంగా టెండర్లు ఖరారు చేశారని ఆరోపణలు వచ్చాయి. అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఫైబర్ నెట్ ఎండీ, చైర్మన్ ప్రభుత్వానికి నివేదించారు. ప్రాథమిక నివేదిక ఆధారంగా సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని సీఐడీ అదనపు డీజీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు […]
Written By:
, Updated On : July 11, 2021 / 06:09 PM IST

ఇప్పటికే పలు కేసులతో బిజీగా ఉన్న సీఐడీ అధికారులకు మరో కేసు వచ్చిపడింది. ఏపీ ఫైబర్ నెట్ లో అక్రమాల ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. గతంలో గుత్తేదారుకు అనుకూలంగా టెండర్లు ఖరారు చేశారని ఆరోపణలు వచ్చాయి. అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఫైబర్ నెట్ ఎండీ, చైర్మన్ ప్రభుత్వానికి నివేదించారు. ప్రాథమిక నివేదిక ఆధారంగా సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని సీఐడీ అదనపు డీజీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి నాదూలాపల్లి శ్రీకాంత్ ఇవాళ జీవో జారీ చేశారు.