
అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్ లో రఘురామ దాఖలు చేసిన రిజాయిండర్ పై రిప్లయ్ దాఖలు చేస్తామని జగన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రిజాయిండర్ పై లిఖిత పూర్వక వివరణ అవసరం లేదని న్యాయస్థానం తెలిపింది. మధ్యాహ్నం 2 గంటలకు ఇరువైపులా వాదనలు వినిపించాలని కోర్టు సూచించింది.