
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. జర్మనీ పౌరసత్వం వెనక్కి ఇచ్చేసినట్లు ఆయన తెలిపారు. చెన్నమనేని కౌంటర్ పై వివరణకు కేంద్ర ప్రభుత్వం గడువు కోరింది. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు రెండు వారాలు గడువు ఇచ్చింది. మరోసారి గడువు కోరవద్దని, తుది వాదనలకు సిద్ధం కావాలని హైకోర్టు సూచించింది.