
హజ్ తీర్థయాత్రను ఇస్లామిక్ దేశం ఇండోనేషియా వరుసగా రెండో ఏడాది రద్దు చేసింది. కొవిడ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ మత వ్యవహారాలశాఖ మంత్రి గురువారం వెల్లడించారు. జీవితంలో ఒక్కసారైనా హజ్ తీర్థయాత్రకు వెళ్లిరావాలనేది ప్రతీ ముస్లిం కోరిక కాగా కోటా విధానం కారణంగా సగటున 20 సంత్సరాలు వేచి చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయని క్యాబినెట్ సెక్రటేరియట్ తెలిపింది.