
టీఎస్ ఎంసెట్ దరఖాస్తు గడువును మరోసారి పొడిగించారు. ఎలాంటి అపరాధ రుసం లేకుండా ఈ నెల 10వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు అని ఎంసెట్ కన్వీనర్ వెల్లడించారు. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు దరఖాస్తు గడువును పొడిగించారు. ఎంసెట్ పరీక్షలు జూలై 5-9 వరకు కంప్యూటర్ బేస్ట్ టెస్ట్ మోడ్ లో జరుగుతాయి. పరీక్షలు మొత్తం 9 సెషన్లలో జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు జరుగుతాయి.