
దేశీ స్టాక్ మార్కెట్ల సూచీలు మంగళవారం లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 270 పాయింట్ల మేర పెరిగి 50922.30, నిఫ్టీ 15291.80, నిఫ్టీ బ్యాంకు సూచీలు 35095 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ప్రభావంతో ఈ మేరకు లాభాలతో ఆరంభమయ్యాయి. జేఎస్ డబ్ల్యూస్టీల్, టైటాన్, ఏసియన్ పెయింట్స్, టాటా స్టీల్, నేస్టే ఇండియా, ఎం అండ్ ఎం షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా హచ్ డీ ఎఫ్ సీ, యాక్సిస్, ఇండస్, ఎస్టీఐ బ్యాంకులు, రిలయన్స్ షేర్లు నష్టాలు చవిస్తున్నాయి.