Indian Army Chief : భారత సైన్యం మాట్లాడదు.. పనిమాత్రమే చేస్తుంది. పని మీదనే దృష్టి పెడుతుంది. ఒకవేళ ఆర్మీ చీఫ్ మాట్లాడాడు అంటే.. వాటి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. తాజాగా భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ప్రెస్‌మీట్ పెట్టారు. కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో పాకిస్తాన్‌లో వణుకు మొదలైంది.
పాకిస్తాన్ సైన్యంతో పోలికే లేదు.
భారత దళాలు దేశ భద్రత, సరిహద్దు రక్షణకు కట్టుబడి ఉన్నాయి. పాకిస్తాన్ సైన్యం మాత్రం రాజకీయాల్లో మునిగి ఉగ్రాలకు మద్దతు ఇస్తుంది. ద్వివేది మాటలు ఇస్లామాబాద్‌లో భయాన్ని కలిగించాయి. ఆపరేషన్ సిందూర్ 2.0కు సైన్యం సిద్ధంగా ఉందని ద్వివేది ప్రకటించారు. మునుపటి ఆపరేషన్‌లో పాక్ 600 మంది సైనికులను కోల్పోయింది. రెండో దశ మొదలైతే పాక్ ఆర్మీ పూర్తిగా దెబ్బతింటుందని స్పష్టం.
ఉగ్ర శిబిరాలపై నిఘా..
పాక్‌లో 8 ఉగ్రవాద కేంద్రాలు గుర్తించామని ద్వివేది వెల్లడి చేశారు. రెండు ఎల్‌వోసీ సమీపంలో, మిగతా ఆరు అంతర్జాతీయ సరిహద్దుల వద్ద ఉన్నాయి. గుజరాత్ నుంచి జమ్మూ వరకు ఇంకో రెండు శిబిరాలను భారత ఆర్మీ గుర్తించింది. వీటి కార్యకలాపాలపైనా నిఘా పెట్టింది. ఉగ్రవాద సంస్థలకు పాక్ ఆర్మీ, ఐఎస్‌ఐ ఎలా మద్దతు ఇస్తుందో కూడా తాము గమనిస్తున్నామని భారత ఆర్మీ చీఫ్ వెల్లడించారు.
పాక్ డ్రోన్ దాడి..
ద్వివేది ప్రెస్‌మీట్ తర్వాత పాక్ డ్రోన్లు పంపింది, భారత్ ధ్వంసం చేసింది. దీనినిబట్టి పాకిస్తాన్ ఆర్మీలో భయం మొదలైందని అర్థమవుతోంది. ఇంతకాలం తమకు అమెరికా అండగా ఉంటుందని పాకిస్తాన్ భావించింది. కానీ భారత ఆర్మీ చీఫ్ ఆ భ్రమలను తొలగింపజేశారు. ఇక ఇదే సమయంలో ఖైబర్ పక్తూంక్వాలో తాలిబాన్ 9 పాక్ సైనికులను చంపింది. పాక్ రక్షణ మంత్రి 16 రాష్ట్రాలుగా విభజన సూచించారు.
పాక్ అమెరికా మద్దతుతో ధైర్యపడుతోంది, కానీ అది తాత్కాలికం. అమెరికా కేవలం క్రిటికల్ మినరల్స్, హమాస్ వ్యూహాలకు పాక్‌ను ఉపయోగిస్తోంది. మరోవైపు పాకిస్తాన్ తోక జాడిస్తే.. కరాచీని మట్టు పెడతామని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక ఇచ్చారు. తాజాగా ద్వివేది మాటలు పాక్‌ను భయపెట్టాయి.