australia women vs india women : స్వదేశం వేదికగా జరుగుతున్న మహిళల వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా ఫైనల్ కి వెళ్ళింది. దక్షిణాఫ్రికా జట్టుతో జరిగే ఫైనల్ మ్యాచ్లో అమీతుమీ తేల్చుకొనుంది. ఉత్కంఠ భరితంగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో టీమిండియా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. బలమైన ఆస్ట్రేలియా మీద ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది.

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా సెమి ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ బ్యాటింగ్ కు సహకరిస్తున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్లేయర్లు పండగ చేసుకున్నారు. 49.5 ఓవర్లలో 338 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా జట్టులో ఓపెనర్ లీచీ ఫీల్డ్ 119 పరుగులు చేసి అదరగొట్టింది. ఫెర్రీ 77, గార్డ్ నర్ 63 పరుగులు చేశారు. టీమ్ ఇండియా బౌలర్లలో శ్రీ చరణి, దీప్తి శర్మ చెరి రెండు వికెట్లు సాధించారు.
339 పరుగుల విజయ లక్ష్యంతో రంగంలోకి దిగిన భారత జట్టుకు 13 పరుగుల వద్ద తొలి ఎదురు దెబ్బ తగిలింది. చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన ఓపెనర్ షఫాలీ వర్మ నిరాశపరిచింది. పది పరుగులు చేసి గార్త్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయింది. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్(127*), మరో ఓపెనర్ స్మృతి మందాన(24) అదరగొట్టారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 46 పరుగులు జోడించారు. జోరు మీదున్న వీరిద్దరిని గార్త్ విడదీసింది. గార్త్ బౌలింగ్ లో స్మృతి వికెట్ కీపర్ కు దొరికిపోయింది. వాస్తవానికి రిప్లై లో బంతి బ్యాట్ చివరి అంచును తగులుతున్నట్టు కనిపించింది. ఆస్ట్రేలియా కెప్టెన్ దానిని సరిగ్గా అంచనా వేయడంలో విజయవంతమైంది. అంపైర్ రివ్యూకి వెళ్లి సక్సెస్ అయింది. స్మృతి అవుట్ అయిన తర్వాత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(89) బ్యాటింగ్ కు వచ్చింది. జెమిమాతో కలిసి మూడో వికెట్ కు ఏకంగా రికార్డు స్థాయిలో 167 పరుగుల భాగస్వామ్ నెలకొల్పింది. ఈ దశలో కౌర్ ఔట్ కావడంతో.. ఆ తర్వాత జట్టును మోసే భారం మొత్తం జెమీమా మీద పడింది. ఆ తర్వాత వచ్చిన ప్లేయర్లలో దీప్తి శర్మ 24, రీచా ఘోష్ 26 పరుగులు చేయడంతో టీమిండియా లక్ష్యం వైపు వేగంగా అడుగులు వేసింది. మరోవైపు అప్పటిదాకా స్థిరమైన ఆట తీరు ప్రదర్శించిన జెమీమా.. తర్వాత గేర్ మార్చింది.
. .
Jemimah Rodrigues soaks in emotions after playing a warrior's knock to help India cross the line in the #CWC25 semi-final #INDvAUS pic.twitter.com/14dJPAgrpo
— ICC (@ICC) October 30, 2025
దూకుడుగా ఆడటం మొదలుపెట్టింది. దీంతో టీమిండియా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఆస్ట్రేలియా విధించిన బలమైన టార్గెట్ ను 48.3 ఓవర్లలోనే ఫినిష్ చేసింది. తద్వారా ఐదు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసి.. ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇప్పటికే సౌత్ ఆఫ్రికా ఫైనల్ లోకి చేరుకుంది. ఇంగ్లాండ్ జట్టు మీద బలమైన విజయాన్ని సాధించి ట్రోఫీకి ఒక అడుగు దూరంగా నిలిచింది. ఇక టీమిండియా కూడా బలమైన ఆస్ట్రేలియాను మట్టికరిపించి ఫైనల్లోకి వెళ్ళింది. సౌత్ ఆఫ్రికా జట్టుతో ట్రోఫీ కోసం పోటీ పడబోతోంది.