Homeఅంతర్జాతీయంIndia warning Bangladesh : భారత్‌ హెచ్చరిక.. బంగ్లాదేశ్‌–పాకిస్తాన్‌ కు చెక్

India warning Bangladesh : భారత్‌ హెచ్చరిక.. బంగ్లాదేశ్‌–పాకిస్తాన్‌ కు చెక్

India warning Bangladesh : బంగ్లాదేశ్‌తో స్నేహం చేసి.. భారత్‌ను భయపెట్టాలని చూసింది మన దాయాది దేశం పాకిస్తాన్‌. ఈ క్రమంలో  పాకిస్తాన్‌ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్‌ ధర్‌ బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లారు. 13 సంవత్సరాల తర్వాత జరిగిన తొలి అధికారిక సందర్శనగా నిలిచింది. 1971లో తూర్పు పాకిస్తాన్‌ విడిపోయి బంగ్లాదేశ్‌ ఏర్పడినప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు సంక్లిష్టంగా ఉన్నాయి. కానీ బంగ్లాదేశ్‌లో ఇటీవలి రాజకీయ మార్పిడి, భారత్‌తో సంబంధాల్లో ఒడిదొడుకులు తర్వాత పాకిస్తాన్‌ బంగ్లాదేశ్‌కు దగ్గర కావాలని చూస్తోంది. కానీ, భారత్‌ ఇచ్చిన చిన్న వార్నింగ్‌ ఆ రెండు దేశాల సంబంధాలకు చెక్‌ పెట్టింది.

బంగ్లాదేశ్‌ భారత వ్యతిరేక ధోరణి..
బంగ్లాదేశ్‌లో షేక్‌ హసీనా ప్రభుత్వం కూలిపోయి, మహ్మద్‌ యూనస్‌ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడడం ఈ పర్యటనకు ముఖ్య కారణం. యూనస్‌ ప్రభుత్వం భారత వ్యతిరేక ధోరణిని అవలంబిస్తూ, చైనాతో సన్నిహిత సంబంధాలను పెంచుకుంటోంది. జమాతే ఇస్లామీ వంటి మతోన్మాద సంస్థలతో సహకారం, అమెరికా మద్దతు, పాకిస్తాన్‌తో దగ్గరవ్వడం భారత్‌కు ఆందోళన కలిగించే అంశాలు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ సైనిక, గూఢచార సంస్థ (ఐఎస్‌ఐ) అధికారులు బంగ్లాదేశ్‌లో జమాతే ఇస్లామీ నాయకులతో సమావేశాలు నిర్వహించడం, రంగ్‌పూర్‌ జిల్లాలోని చికెన్స్‌ నెక్‌ సమీపంలోని ఎయిర్‌బేస్‌ను చైనాకు అప్పగించాలనే నిర్ణయం భారత్‌కు వ్యూహాత్మక సవాళ్లను సృష్టిస్తోంది.

చైనా, పాకిస్తాన్‌కు బంగ్లా సహకారం..
బంగ్లాదేశ్‌లోని ఎయిర్‌బేస్‌ నిర్మాణ కాంట్రాక్టును పాకిస్తాన్‌ కంపెనీకి అప్పగించడం, చైనాతో సైనిక సహకారం పెంచుకోవడం ఈ పర్యటన యొక్క మరో కీలక అంశం. చికెన్స్‌ నెక్‌ ప్రాంతం, ఈశాన్య భారత్‌ను దేశంతో అనుసంధానించే సన్నని భూ భాగం, వ్యూహాత్మకంగా కీలకమైనది. ఈ ప్రాంతంలో చైనా, పాకిస్తాన్‌ ప్రభావం పెరగడం భారత భద్రతకు గణనీయమైన ముప్పుగా పరిగణించబడుతోంది. ఈ సందర్భంలో, పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌ బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌పై తూర్పు దిశ నుంచి దాడి చేసే సూచనలు చేయడం పాకిస్తాన్‌ ఎత్తగడలో భాగం.

భారత్‌ ఎత్తుకు పై ఎత్తు…
భారత్‌ ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తూ, బంగ్లాదేశ్‌కు సున్నితమైన హెచ్చరికలు జారీ చేసింది. బంగ్లాదేశ్‌ ఆర్మీ చీఫ్‌ వకార్‌ ఉల్‌ జమాన్‌ భారత్‌కు అనుకూల ధోరణిని కొనసాగిస్తున్నాడు, అయితే యూనస్‌ ప్రభుత్వం ఆయనను తొలగించే ప్రయత్నాలు చేసింది. ఈ ప్రయత్నాలు విఫలమవడంలో భారత్‌ యొక్క దౌత్యపరమైన పాత్ర కీలకంగా ఉంది. బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేక కార్యకలాపాలు ఊపందుకున్నప్పటికీ, బ్రహ్మపుత్ర, గంగా, తీస్తా, కుషియా వంటి నదుల నీటి సరఫరా భారత్‌ నియంత్రణలో ఉండడం వల్ల బంగ్లాదేశ్‌ భారత్‌పై ఆధారపడక తప్పని పరిస్థితి ఉంది. ఈ భౌగోళిక ఆధిపత్యం భారత్‌కు వ్యూహాత్మక ప్రయోజనాన్ని ఇస్తుంది.

పాకిస్తాన్‌కు బంగ్లాదేశ్‌ మెలిక..
బంగ్లాదేశ్‌–పాకిస్తాన్‌ సంబంధాలు బలోపేతం కావడానికి 1971 యుద్ధంలో పాకిస్తాన్‌ సైన్యం చేసిన దురాగతాలు అడ్డంకిగా నిలుస్తున్నాయి. ఆ సమయంలో లక్షలాది మంది ఊచకోతకు గురైన ఘటనలకు పాకిస్తాన్‌ బాధ్యత వహించాలని బంగ్లాదేశ్‌ డిమాండ్‌ చేసింది. అదనంగా, దేశ విభజన సమయంలో 4.52 బిలియన్‌ డాలర్ల ఆస్తులపై బంగ్లాదేశ్‌ హక్కు కోరుతోంది. ఇషాక్‌ ధర్‌ ఈ డిమాండ్లను ‘గతంలో ముగిసిన అధ్యాయం‘గా కొట్టిపారేయడం ద్వైపాక్షిక సంబంధాలకు ఆటంకంగా మారింది. 1974, 2002లో పాకిస్తాన్‌ క్షమాపణలు చెప్పినప్పటికీ, మళ్లీ క్షమాపణ చెప్పడానికి నిరాకరించడం ద్వారా సంబంధాలు బెడిసికొట్టాయి.

భారత్‌తో భౌగోళిక రాజకీయ ప్రయోజనం..
4,082 కిలోమీటర్ల సరిహద్దును పంచుకునే బంగ్లాదేశ్, భారత్‌పై ఆర్థిక, భౌగోళికంగా ఆధారపడుతుంది. నీటి సరఫరా, వాణిజ్యం, ఈశాన్య రాష్ట్రాలకు కనెక్టివిటీ వంటి అంశాల్లో భారత్‌ ఆధిపత్యం బంగ్లాదేశ్‌ను భారత్‌తో సహకరించమని ఒత్తిడి చేస్తుంది. ఈ నేపథ్యంలో, బంగ్లాదేశ్‌ పాకిస్తాన్‌తో సంబంధాలను బలోపేతం చేయాలనే ప్రయత్నాలు భారత్‌ యొక్క దౌత్యపరమైన హెచ్చరికలతో చెక్‌ పడింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular