Homeక్రీడలుIndia vs pakistan : సిగ్గుతో తలదించుకోండి రా పాకీలు.. శ్రీలంక మీ పరువు ఎలా...

India vs pakistan : సిగ్గుతో తలదించుకోండి రా పాకీలు.. శ్రీలంక మీ పరువు ఎలా తీసిందో?

India vs pakistan : టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ తమ గడ్డ మీద ఆడటం శ్రీలంక జట్టుకు ఇష్టం లేదు. కాకపోతే తప్పదు కాబట్టి.. పాకిస్తాన్ ప్లేయర్లకు ఆతిధ్యం ఇచ్చింది. పాకిస్తాన్ ప్లేయర్ల వ్యవహార శైలి తెలుసు కాబట్టి శ్రీలంక క్రికెట్ బోర్డు.. ఖరీదైన హోటళ్ల లో కాకుండా.. బడ్జెట్ హోటల్స్ లో స్టే చేసే అవకాశం కల్పించింది. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరిగినప్పటికీ.. శ్రీలంక క్రికెట్ బోర్డు పాకిస్తాన్ ప్లేయర్ల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. వారికి వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ కల్పించలేదు.

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఒప్పుకున్న తర్వాత.. టీమిండియాతో ఆడే మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. దీంతో కొలంబో మైదానాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు అద్భుతంగా తీర్చిదిద్దింది. అంతేకాదు కొలంబోలో అడుగుపెట్టిన టీమ్ ఇండియా ప్లేయర్లకు అడుగడుగునా ఘన స్వాగతం పలికింది. అదే కాదు భారత ప్లేయర్లు బస చేసిన హోటల్లో కట్టుదిట్టమైన భద్రత కల్పించింది. అంతేకాదు ఆ బస్సులో కూడా ఆయుధాలు ధరించిన సెక్యూరిటీ సిబ్బంది ఉండడం విశేషం.

భారత జట్టు ప్లేయర్లు బయలుదేరింది మొదలు.. స్టేడియంలో దిగే వరకు ప్రతి క్షణం కూడా ఉత్కంఠ గా సాగింది. శ్రీలంక ఆర్మీ టీమిండియా ప్లేయర్లకు అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పించింది. అత్యంత విలాసవంతమైన హోటల్ లో బస చేసే అవకాశం కల్పించింది .. ఇదే పాకిస్తాన్ ప్లేయర్లకు మాత్రం ఒక మామూలు హోటల్ కేటాయించింది. పాకిస్తాన్ ప్లేయర్లకు శ్రీలంక ప్రభుత్వం భద్రత విషయంలో సాధారణ స్థాయిని అనుసరించింది.

“దేశాన్ని బట్టి గౌరవం లభిస్తుంది. స్థాయిని బట్టి సత్కారం లభిస్తుంది. ఇది పాకిస్తాన్ ప్లేయర్లకు అనుభవంలోకి వచ్చింది. టీమిండియా ప్లేయర్లకు ఘన సత్కారం లభిస్తే.. పాకిస్తాన్ ప్లేయర్లకు దారుణమైన పరాభవం ఎదురయింది. బహుశా పాకిస్తాన్ జట్టు ఇప్పటికైనా తాను చేస్తున్న తప్పు ఏమిటో తెలుసుకోవాలి. పాకిస్తాన్ దేశం తన స్థాయిని పెంచుకునే దిశగా అడుగులు వేయాలి. గతంలో శ్రీలంక క్రికెటర్లు పాకిస్థాన్లో పర్యటించారు . ఆ సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. శ్రీలంక ప్లేయర్లు వెంట్రుక వాసిలో ప్రాణాలు కాపాడుకున్నారు. అలాంటి ఉగ్రవాద దేశానికి చెందిన ప్లేయర్లకు ఇంతకంటే గొప్ప సత్కారం ఏం లభిస్తుందని” నెటిజన్లు పేర్కొంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular