India Vs England Test Series 2025: త్వరలో ఇంగ్లాండ్ వేదికగా టీమ్ ఇండియా ఐదు టెస్టులు ఆడనుంది. జూన్ 20 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. శుక్రవారం టీమ్ ఇండియా ఆటగాళ్లు విమానంలో యూకేకు బయలుదేరగా ఇవాళ ఇంగ్లాండ్ చేరుకుననారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. భారత్ క్రికెట్ జట్టులో భాగం కావడం చాలా బాగుంది. టెస్ట్ సిరీస్ లో యూకేకు స్వాగతం అని సాయి సుదర్శన్ ఆ వీడియో లో అన్నాడు.