
భారత్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. హార్దిక్ పాండ్య (19) ఔటయ్యాడు. జయవిక్రమ వేసిన 28.3 ఓవర్ కు వికెట్ల ముందు దొరికిపోయాడు. తొలుత అంఫైర్ నాటౌటిచ్చినా శ్రీలంక రివ్యూకు వెళ్లడంతో అక్కడ ఔట్ గా తేలింది. దాంతో భారత్ 179 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. మరోవైపు సూర్యకుమార్ (34) పరుగులతో ఉన్నాడు. ఇప్పడే క్రీజులోకి నితీశ్ రాణా వచ్చాడు.