India Hypersonic Missile : హైపర్ సోనిక్ క్షిపణి విషయంలో భారత్ సంచలనం సృష్టించింది. తొలిసారిగా దీర్ఘ శ్రేణిలో హైపర్ సోనిక్ క్షిపణి ని అత్యంత విజయవంతంగా పరీక్షించింది. ఈ ప్రయోగం ఎప్పుడు చేసిందో భారత రక్షణ శాఖ వివరించింది. ఆ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ పరీక్ష విజయవంతం కావడంతో దీర్ఘ శ్రేణి హైపర్ సోనిక్ క్షిపణులు ఉన్న దేశాల సరసన భారత్ చేరింది. భారత్ ప్రయోగించిన క్షిపణి 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ ని కూడా చేయగలదు వాటర్ హెడ్ లను మోసుకుపోతుంది. దీనిని శాస్త్రవేత్తలు అలా రూపొందించారు.. దీర్ఘ శ్రేణి హైపర్ సోనిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం కావడంతో భారత్ కీర్తి ప్రతిష్టలు పెరిగాయి. ఈ క్షిపణి ప్రయోగాన్ని ఒడిశా తీర ప్రాంతంలోని అబ్దుల్ కలాం ద్వీపకల్పంలో దీనిని చేపట్టారు. ఈ ప్రయోగం ద్వారా అత్యాధునిక మిలిటరీ సాంకేతిక పరిజ్ఞాన్ని సాధించిన దేశాలలో భారత్ చేరింది. ఇక దీనికి సంబంధించిన వీడియోను భారత రక్షణ శాఖ ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఈ ప్రయోగ సమయంలో డిఆర్డిఓ శాస్త్రవేత్తలు క్షిపణి గమనాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేశారు. దీనికి డి ఆర్ డి ఓ ప్రయోగ కేంద్రాలు, ఇతర పరిశ్రమలు ఉపకరించాయి. సైనిక దళాలకు చెందిన కీలక అధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు.
సాంకేతిక పరిజ్ఞానం ఇలా పనిచేస్తుంది
శబ్ద వేగానికి ఐదురెట్ల కంటే ఎక్కువ వేగంతో ఈ క్షిపణి ప్రయాణిస్తుంది. అంటే గంటకు 6,200 కిలోమీటర్లు వేగంతో ప్రయాణిస్తుంది. ఒకవేళ ఈ సాంకేతికతకు శాస్త్రవేత్తలు ఇంకా ఎక్కువ పదును పెడితే 24,410 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఆ వేగంలోనూ క్షిపణి శత్రు దేశాల రాడార్లకు దొరకకుండా ప్రయాణిస్తుంది. గగనతల రక్షణ వ్యవస్థ నుంచి కూడా తనను తాను కాపాడుకుంటుంది. తన దిశను ఎప్పటికప్పుడు మార్చుకుంటుంది. దాదాపు 30 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకోగల సామర్థ్యం దీని సొంతం. ఆ తర్వాత రాకెట్ ఇంజన్ నుంచి విడిపోతుంది. గైడ్ వెహికిల్ ఇచ్చిన టార్గెట్ దిశగా వెళుతుంది. హైపర్ సోనిక్ క్షిపణి పూర్తి భిన్నంగా సాగుతుంది. రాడార్ పరిధిలోకి పని వచ్చేసరికి.. తన దిశను మార్చుకుంటుంది. ఆ
స్వల్ప సమయంలోనే తన లక్ష్యాన్ని ఫినిష్ చేస్తుంది. చుట్టూ శత్రు దేశాలు, రక్షణ పరంగా మెరుగైన క్షిపణుల కోసం భారత్ ఈ ప్రయోగం చేసింది. ఈ ప్రయోగం ద్వారా అత్యంత విలువైన క్షిపణులు కలిగిన దేశంగా భారత్ ఆవిర్భవించింది.