
ఏపీలో కరోనా కేసులు కాస్త పెరిగాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 80,641 పరీక్షలు నిర్వహించగా 2,068 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,64,117 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 22 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 13,354కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 49,683 యాక్టివ్ కేసులున్నాయి.