
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక ఓట్ల కౌంటింగ్ కొనసాగుతున్నది. ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నది. ఇప్పటి వరకు వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 94,307 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. వైసీపికి 2,24, 480 ఓట్లు పోలవగా, టీడిపీ అభ్యర్థి పనబాక లక్షికీ 1,30,173 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 22,940 ఓట్లు పోలయ్యాయి.