
బీహార్ లోని ముజఫర్ పూర్ జిల్లాలోని సక్రా బ్లాక్ లో కరోనా లక్షణాలతో గత 27 రోజుల్లో 36 మంది మరణించారు. దీంతో ప్రజలు భయంభయంగా కాలం వెళ్లదీస్తున్నారు. జలుబు, దగ్గుతో గ్రామంలో గత 27 రోజుల్లో 36 మంది మరణించారని గ్రామ సర్పంచ్ వెల్లండించారు. ఈ మరణాలకు సంబంధించి బ్లాక్ వైద్యాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలనని, పరీక్షలు నిర్వహించాలని చెప్పానన్నారు. అయితే అక్కడ టెస్టింగ్ కిట్లు అందుబాటులో లేవని తెలిపారు. దీంత తమకు కిట్లు కావాలని, మరణాలకు గల కారణాలు తెలుసుకోవాలని జిల్లా వైద్యాధికారులను కోరినట్లు చెప్పారు.