Children addicted to phones : ప్రస్తుతం చాలా మంది పిల్లలు సెల్ ఫోన్, ల్యాప్ టాప్, టీవీలకు తెగ అలవాటు పడుతున్నారు. ఇక సెల్‌ఫోన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇదొక పిచ్చి పట్టుకుంది. చిన్న పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే పిల్లలు మారం చేస్తున్నారని పెద్దలు ఫోన్లు ఇస్తున్నారు. కానీ వారి మారానికి ఫోన్ ఇస్తే తర్వాత పెద్ద సమస్యలా మారుతుంది. చాలా మంది ఇంటిలో ఇదొక సమస్య కూడా. స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల పిల్లలు ఫోన్ కు బానిసలు అవుతున్నారు. ఫోన్ లేకపోతే తిండి కూడా తినము అని బెదిరిస్తున్నారు. తినడం లేదు కూడా. ఈ ఫోన్ పిల్లల మానసిక ఆరోగ్యానికి చాలా ప్రమాదం. ఇదే కంటిన్యూ అయితే మాత్రం పిల్లలు ఆందోళన, నిరాశకు గురయ్యే ప్రమాదం ఉంది.
సోషల్ మీడియా పిల్లలకు తీవ్రమైన ప్రమాదాలను కలిగిస్తుంది అంటున్నారు నిపుణులు. ఇది చిన్న వయస్సులోనే వారి కంటి చూపును ప్రభావితం చేస్తుంది. వారి నిద్ర విధానాలు, ఆందోళన స్థాయిలను ప్రభావం చేసే అవకాశం కూడా ఉంది. చాలా మంది పిల్లలు డిప్రెషన్‌లోకి వెళ్తున్నారు. పిల్లలు ఫోన్ కు అలవాటు పడటానికి కారణం తల్లిదండ్రులు అనడంలో సందేహం లేదు. పిల్లలు ఏడుస్తున్నారని, తినడం లేదని ఫోన్లు ఇస్తున్నారు. సో వారికి కూడా అదే అలవాటు అవుతుంది. ఇప్పటికైనా పిల్లల్ని ఈ సమస్య నుంచి రక్షించండి. దీని కోసం కొన్ని పద్దతులు పాటించండి. మరి అవేంటంటే?
పిల్లల డిజిటల్ కంటెంట్‌పై పరిమితులు విధించాలి. . పిల్లల డిజిటల్ ఎక్స్పోజర్ సమయాన్ని తగ్గించడం చాలా అవసరం. ఇది మీ బాధ్యత. వాళ్లు మారాం చేసిన సరే ఫోన్ ఇవ్వవద్దు. ఇదే కంటిన్యూ చేస్తే వాళ్లు ఆ సెల్‌ఫోన్లను వాడటం మానేస్తారు. పెద్దలు కూడా పిల్లల ముందు ఫోన్ల వాడవద్దు. పిల్లలకు వీలైనంత దూరంలో ఫోన్ లను పెట్టండి. ఇలా చేయడం వల్ల వారి ధ్యాస ఇతర పనుల మీదకు వెళ్తుంది.
ఈ ఫోన్ వాడకం తగ్గించాలంటే వారిని ఆడుకోవడానికి తీసుకువెళ్లడం అవసరం. దీని వల్ల సెల్‌ఫోన్లకు దూరమవుతారు. దగ్గరుండి మీరు పార్కులు, విహారయాత్రలకు తీసుకువెళ్లాలి. దీని వల్ల వారి మానసిక ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది అంటున్నారు నిపుణులు. బయటకు వెళ్లడం కుదరకపోతే ఇంట్లోనే క్యారమ్ బోర్డు ఆడించడం, చెస్ వంటి ఇండోర్ గేమ్స్ మీద ఫోకస్ చేయించండి. దీని వల్ల పిల్లలకు ఆటల మీద ఇంట్రెస్ట్ పెరిగే అందులోనే లీనమవుతారు. వారి ధ్యాస ఫోన్ల మీదికి మళ్లదు.
బిజీ లైఫ్ వల్ల పిల్లలకు సరైన సమయాన్ని కేటాయించడం లేదు తల్లిదండ్రి. వారికి సమయం ఇవ్వకపోతే మానసికంగా ఇబ్బంది పడతారు పిల్లలు. సెల్‌ఫోన్‌ని తమ స్నేహితుడిగా అనుకుంటారు. అందుకే పిల్లలకు కాస్త సమయం ఇవ్వండి. వారితో ప్రేమగా ఉండటం అలవాటు చేసుకోండి.
ఇంటి పనుల్లో భాగం చేయడం వల్ల కూడా పిల్లలు ఫోన్ లకు దూరం అవుతారు. వారికి చిన్న చిన్న పనులు చెప్పడం చాలా అవసరం. మొక్కలకు నీరు పోయడం, ఆట బొమ్మల్ని సరైన ప్లేసులో పెట్టడం బ్యాగు సర్దడం, వంటి పనులు వారే చేయాలి. ఇవి వారి సొంత పనులు అని గుర్తు చేయండి. ఇలా చేయడం వల్ల కేర్ పెరుగుతుంది.
సెల్ ఫోన్లలో డేటా ఉండటం వల్ల సోషల్ మీడియాకు అడెక్ట్ అవుతున్నారు. వారికి ఫోన్ ఇచ్చినప్పుడు ఇంటర్నెట్ ఆఫ్ చేసి ఇవ్వండి. దీంతో.. ఫోన్‌లో ఏం చూడటానికి కుదరదు కాబట్టి ఫోన్ తగ్గిస్తారు. మీ పనుల్లో బిజీ కావడానికి వారికి ఫోన్లు ఇస్తే ఇక మానేయండి. లేదంటే వారికి ఫోన్ పెద్ద అడిక్షన్‌లా మారుతుంది. వారి ముందు ఫోన్ వాడకుండా కలిసి హాయిగా ఆడుకోండి. కథలు చెప్పడం, డ్రాయింగ్, పెయింటింగ్ వంటి హాబీస్ అలవాటు చేయడం వల్ల మెరుగు అవుతారు పిల్లలు.