
తెలంగాణలో స్వపరిపాలన, ఆత్మగౌరవంతో నిలబడాలనే ఉద్దేశంతో నే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి లో చేపట్టిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్షలో భట్టి మాట్లాడారు. ఏ లక్షాల సాధన కోసం తెలంగాణ ఏర్పాటు చేశారో అవి ఈరోజు నేరవేరడం తేదని అసహనం వ్యక్తం చేశారు. ఆత్మగౌరవంతో బతకాలనుకునే ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని కోరారు. దళిత బంధును హుజూరాబాద్ కే పరిమితం చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు.