
నేలతల్లి బాగుంటేనే మనం బాగుంటాం భావి తరాలు బాగుంటాయని అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి మంద్రకరణ్ రెడ్డి అన్నారు. పుడమి తల్లి మన అవసరాలను తీర్చగలదు గానీ అత్యాశలను ఎంతమాత్రం తీర్చలేదని అన్నారు. ఆనాడు జాతిపిత మహాత్మాగాంధీ చెప్పిన మాటాలు అక్షర సత్యాలని అన్నారు. భామిపై లభించే సహజ వనరులను మనం ఇష్టానుసారంగా వినియోగించడం వల్ల పర్యావరణానికి హాని జరుగుతోందని వెల్లడించారు. కాలుష్యం వల్ల ఓజోన్ పొర క్షీణిస్తోందన్నారు. భూమాతకు ఎటువంటి హానీ కలుగకుండా కాపాడుకోవాలని ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి కోరారు.