
టీడీపీ అభ్యర్థి పనాబాక లక్ష్మి కీలక వ్యాఖ్యలు చేశారు. మొదటి రౌండ్ ఫలితాల తర్వాత కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన్నట్లు వచ్చిన వార్తలను ఆమె ఖండించారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగితే ఫలితాలు వేరేగా ఉండేవని ఆమె అన్నారు. ఫలితం తెలిసి కూడా తమాషా చూద్దామనే కూర్చుని వున్నానని ఆమె చెప్పారు. జరగాల్సినవన్ని ముందే జరిగిన తర్వాత ఇప్పుడు జరిగేదేముంది అని ఆమె అన్నారు.