
తౌక్టే తుఫాన్ ప్రభావం కారణంగా రాష్ట్రానికి రూ. 146 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని ఆయన స్పష్టం చేశారు. పెనుగాలుల తీవ్రతకు మూడు రోజులుగా మత్య్సకారులు సముద్రంలోకి వెళ్లడం లేదు. ఉపాధి లేకుండా ఇబ్బందిపడుతున్న వారికి అండగా ఉంటామన్నారు. భీకర గాలుల కారణంగా తలెత్తిన పరిస్థితిని చక్కదిద్దేందుకు విపత్తు నిర్వహణ బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగాయని ఆయన చెప్పారు.