
తెలంగాణలో కరోనా పరిస్థితులపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. నిన్న ఖమ్మం పర్యటనలో ఉన్న ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు హైకోర్టులో విచారణకు హాజరు కాలేకపోయారు. డీహెచ్ విచారణకు హాజరు కావాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేయడంతో ఇవాళ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా డీహెచ్ శ్రీనివాసరావు విచారణకు హాజరయ్యారు. మూడో దశ కరోనా ఎదుర్కొనేందుకు ఏం చర్యలు చేపట్టారని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.