Horoscope Today: 2024 ఏప్రిల్ 14 ఆదివారం రోజున ద్వాదశ రాశులపై అర్ద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఆదివారం చైత్ర నవరాత్రుల సందర్భంగా కొన్ని రాశుల వారికి శుభయోగాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఇంతకాలం ఉన్న సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారులు కొన్ని కష్టాలను ఎదుర్కొంటారు. ఆలోచనాత్మకంగా వ్యవహరించాలి.
వృషభ రాశి:
సమస్యలు మరింత ప్రమాదంగా మారే అవకాశం. కుటుంబ బాధ్యతలు చక్కగా నెరవేర్చాలి. వివాహం చేసుకునేవారికి ప్రతిపాదనలు వస్తాయి. వ్యాపారులకు కొత్త అవకాశాలు వస్తాయి.
మిథునం:
ఆదాయం పెరుగుతుంది. స్నేహితుల్లో ఒకరిని కలుస్తారు. ఎవరినైనా గుడ్డిగా నమ్మొద్దు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు.
కర్కాటకం:
విహార యాత్రలకు ప్లాన్ వేస్తారు. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారంలో పురోగతి లభిస్తుంది. స్నేహితులతో సరదాగా ఉంటారు. సోదరుల సాయం తీసుకుంటారు.
సింహ:
ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు తల్లిదండ్రుల సలహా తీసుకోవాలి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. కొన్ని ప్రణాళికల ద్వారా ఆదాయం పెరుగుతుంది.
కన్య:
పాత తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకుంటారు. పాత విషయాలు గుర్తు చేసుకుంటూ రిప్రెష్ అవుతారు. పిల్లల కెరీర్ కు సంబంధించి కొన్ని శుభవార్తలు వింటారు.
తుల:
జీవిత భాగస్వామి నుంచి ప్రతికూల వాతావరణం ఉంటుంది. పెరుగుతున్న ఖర్చులను నియంత్రించుకోవాలి. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు.
వృశ్చికం:
ఈ రాశి వారికి అనేక రంగాల్లో పురోగతి లభిస్తుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరు ఉద్యోగాన్ని పొందుతారు. ఆర్థిక లావాదేవీల్లో సమస్యలు వస్తాయి.
ధనస్సు:
ఉద్యోగులు కొన్ని విషయాల్లో ఆందోళన చెందుతారు. వ్యాపారులకు ఆదాయం మిశ్రమంగానే ఉంటుంది. కొన్ని సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు.
మకర:
కుటుంబ సభ్యుల నుంచి సలహాలు తీసుకోవాలి. ఎవరికైనా వాగ్దానం ఇస్తే కచ్చితంగా నెరవేర్చాలి. ఇతరులకు అప్పులు ఇవ్వడం మానుకోవాలి.
కుంభం:
వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. విహార యాత్రలకు వెళ్లే అవకాశం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని ఖర్చులు ఇబ్బంది పెడుతాయి.
మీనం:
అధిక పని కారణంగా కష్టపడాల్సి వస్తుంది. బ్యాంకు బ్యాలెన్స్ ను సమతుల్యంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆరోగ్య సమస్యపై నిర్లక్ష్యంగా ఉండొద్దు.