Horoscope Today: 2024 ఏప్రిల్ 26 శుక్రవారం రోజున ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు వృశ్చిక రాశిలో సంచరించనున్నాడు. దీంతో ఓ రాశి వారు ఏ పని చేసినా అడ్డంకులు ఏర్పడుతాయి. మరికొన్ని రాశుల వారికి అధిక ప్రయోజనాలు ఉంటాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఈ రాశి వారు ఈరోజు అధిక ప్రయోజనాలు పొందుతారు. కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబం గురించి శ్రద్ధ తీసుకోవాలి.
వృషభ రాశి:
మాటలను అదుపులో ఉంచుకోవాలి. రాజకీయాలకు దూరంగా ఉండాలి. వినోదం కోసం డబ్బును ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఆదాయం అతంత మాత్రంగానే ఉంటుంది.
మిథునం:
ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉంటారు.
కర్కాటకం:
ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. అనవసర విషయాల్లో తలదూర్చకుండా ఉండాలి.
సింహ:
సమాజంలో సంబంధాలు బలపడుతాయి. వ్యాపారంలో కొత్త ప్రాజెక్టులు చేపడుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారు.
కన్య:
కొన్ని విషయాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త పనిని నేర్చుకుంటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది.
తుల:
బంధువులతో సంతోషంగా గడుపుతారు. రాజకీయాలకు దూరంగా ఉండడం మంచిది. వివాహ ప్రయత్నాలు మొదలవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
వృశ్చికం:
ఓ వ్యక్తి నుంచి బహుమతిని పొందుతారు. ఇతరుల నుంచిప్రశంసలు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యేవారు బిజీగా ఉంటారు. ఆదాయం పెరిగినా ఖర్చుల ఉంటాయి.
ధనస్సు:
కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.వ్యాపార రంగంలో కొత్త అవకాశాలు ఉంటాయి. ఉద్యోగులు కార్యాలయాల్లో ప్రశాంతంగా గడుపుతారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి.
మకర:
కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. కొత్త ఆలోచనలతో ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి.నాణ్యమైన ఆహారం తీసుకోవాలి. లక్ష్యాలను పూర్తి చేస్తారు.
కుంభం:
ఈ రాశి వారికి ఈరోజు అన్నీ అనుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో సంతోష వాతావరణం ఉంటుంది. కొన్ని నిర్ణయాలు బెడిసికొడుతాయి.
మీనం:
ఈ రాశి వారు ఈరోజు కష్టంగా ముందుకు సాగుతారు. ఏ పని మొదలు పెట్టినా అడ్డుంకులు ఏర్పడుతాయి. నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రతతగా ఉండాలి.