Horoscope Today: 2024 ఏప్రిల్ 23 మంగళవారం రోజున ద్వాదశ రాశులపై చిత్తా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తుల రాశిలో సంచరించనున్నాడు. దీంతో కొన్ని రాశుల వారిపై హనుమాన్ జయంతి ప్రభావం ఉండే అవకాశం ఉంది. అలాగే మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
వివిధ రంగాల వారికి ఆర్థిక పురోగతి ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. నిరుద్యోగులు శుభవార్త వింటారు.
వృషభ రాశి:
ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. కొత్తవారిని నమ్మొద్దు. అనవసర విషయాల్లోజోక్యం చేసుకోవద్దు. కుటుంబంలో వివాదాలు నెలకొన్న వివాదాలను పరిష్కరించేందుకు ప్రయత్నించాలి..
మిథునం:
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. నాణ్యమైన ఆహారం తీసుకోవాలి. వ్యాపారులకు ఆర్థిక ప్రయోజనాలు తక్కువే అని చెప్పాలి. ఖర్చులను నియంత్రించకపోతే మరీ కష్టమవుతుంది.
కర్కాటకం:
హనుమాన్ జయంతి సందర్భంగా ఈ రాశి వారు కొన్ని శుభవార్తలు వింటారు. విద్యార్థులు కెరీర్ పై దృష్టి పెడుతారు. స్నేహితుల ద్వారా కొత్త ప్రణాళికలు వేస్తారు.
సింహ:
ఆర్థిక విషయాల్లో మెరుగ్గా ఉంటుంది. సంపాదన పెరుగుతుంది. అవకాశాలు పుడుతాయి. ఉత్సాహంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కన్య:
చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో లాభాలను అందుకుంటారు. వ్యాపారస్తుల ఆదాయం పెరుగుతుంది. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు.
తుల:
ఈ రాశి వారు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యమైన నిర్ణయాల గురించి ఆలోచించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు.
వృశ్చికం:
ఈ రాశివారు లక్ష్యాన్ని చేరుకోవడంలో బిజీ అవుతారు. మానసికంగా అలసటగా ఉంటారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు కెరీర్ పై ఫోకస్ చేస్తారు.
ధనస్సు:
ఈ రాశి వారికి ఈరోజు జీవితంలో ములుపు ఉంటుంది. కొన్ని పనులు కలిసి వస్తాయి. కృషి, పట్టుదల వల్ల కొన్ని పనులు కలిసి వస్తాయి. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు.
మకర:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటారు. కొత్త దనం కోసం ప్రయత్నిస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు.
కుంభం:
ఈ రాశి వారిపై హనుమాన్ జయంతి ప్రభావం ఉంటుంది. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. వ్యాపారులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. అనుకోని లాభాలు వస్తాయి. స్నేహితులతో గడుపుతారు.
మీనం:
ఈ రాశివారికి ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. పెరుగుతున్న ఖర్చులను నియంత్రించాలి. ఆదాయం పెరుగుతుంది.