Horoscope Today: 2025 ఏప్రిల్ 29 సోమవారం రోజున ద్వాదశ రాశులపై ఉత్తరాషాఢ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు మకర రాశిలో సంచరించనున్నాడు. దీంతో మేష రాశి వారు తమ జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. మరికొన్ని రాశుల వ్యాపారులు ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఈ రాశి వారు ఈరోజు ఉత్సాహంతో పనిచేస్తారు. వ్యాపారుల పెట్టుబడులకు లాభాలు ఉంటాయి. ఆదాయం పెరగడానికి అవకాశాలు వస్తాయి. జీవితభాగస్వామితో అన్యోన్యంగా ఉంటూ పడక సమయం పంచుకుంటారు.
వృషభ రాశి:
కొత్త ప్రాజెక్టులు చేపడుతారు. కొన్ని విషయాల్లో తొందరపడొద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కష్టపడిన దానికి ఫలితం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.
మిథునం:
కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. ఎక్కువగా వాదనలు చేయొద్దు.
కర్కాటకం:
వ్యాపారులకు ఈరోజు అనుకూలమైన రోజు. కుటుంబ సభ్యులతో గడుపుతారు. వినోదం కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
సింహ:
స్నేహితులతో సరదాగా ఉంటారు. వ్యాపారంలో విజయం సాధిస్తారు. కొత్త పెట్టుబడులు పెట్టే సమయంలో ఇతరుల సలహా తీసుకోవాలి. ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
కన్య:
కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయాల్లో బిజీగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులను నియంత్రించాలి.
తుల:
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కొందరు వ్యక్తుల నుంచి బహుమతులు పొందుతారు. చేసే పనులకు ఆటంకాలు ఏర్పడుతాయి. మితిమీరిన ఉత్సాహం దెబ్బ తీస్తుంది.
వృశ్చికం:
ఈ రాశి వారు అనేక అడ్డంకులు ఎదుర్కొంటారు. బంధువుల నుంచి కొన్ని బహుమతులు అందుకుంటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
ధనస్సు:
కొన్ని విషయాలను పట్టించుకోకుండా ఉండాలి. ఇష్టమైన ఆహారం తీసుకోవాలి. విద్యార్థులు కెరీర్ పై దృష్టి పెట్టాలి. ఏ పని చేసినా విజయం సాధిస్తారు.
మకర:
వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని నిర్ణయాలు ప్రయోజనకరంగా ఉంటాయి.
కుంభం:
గతంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగులు అంకిత భావంతో పనిచేస్తారు. కొన్ని కోరికలు నెరవేరుతాయి. అనుకున్న దానికంటే ఎక్కువ సంపాదన వస్తుంది.
మీనం:
కొన్ని పనుల్లో నిరాశ కలుగుతుంది. బంధువుల నుంచి ముఖ్యమైన సమాచారం పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారు ఓ కీలక నిర్ణయం తీసుకుంటారు.