Horoscope Today: 2025 మే 12 ఆదివారం రోజున ద్వాదశ రాశులపై మృగశిర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు కర్కాటక రాశిలో సంచరించనున్నాడు. దీంతో ఓ రాశి వారు ఈరోజు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. అలాగే 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి:
నైపుణ్యాలు ప్రదర్శిస్తారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగులు సీనియర్ల మద్దతు పొందుతారు. స్నేహితుల సహకారంతో కొన్ని ముఖ్యమైన పనులు చేయగలుగుతారు.
వృషభ రాశి:
కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆస్తులకు సంబంధించి ఓ శుభవార్త వింటారు.
మిథున రాశి:
కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. సమాజంలో గౌరవం పెరగుతుంది. జీవిత భాగస్వామితో గొడవలు ఉండే అవకాశం. కొన్ని పనుల కోసం కష్టపడాల్సి వస్తుంది.
కర్కాటక రాశి:
కొన్ని పనుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. సమయానికి అనుకూలంగా కొన్నిపనులు పూర్తి చేయాలి. విద్యార్థుల కెరీర్ పై దృష్టి పెడుతారు.
సింహారాశి:
ఇతరుల నుంచి బహుమతులు పొందుతారు. ఉద్యోగులు బిజీ వాతావరణంలో గడుపుతారు. ఆదాయం పెరుగుతంది. కానీ ఖర్చులను నియంత్రించాలి.
కన్య రాశి:
కొన్ని శుభవార్తలు వింటారు. పెట్టుబడులపై రాబడులు వస్తాయి. ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు.
తుల రాశి:
ఓ సమస్య గురించి తీవ్ర ఆందోళనకు గురవుతారు. ఉద్యోగులు శ్రమ పడాల్సి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారు శుభవార్తలు వింటారు.
వృశ్చిక రాశి:
కొన్ని ఆలోచనలు సమస్యలు తెస్తారు. అందువల్ల తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగులు సీనియర్ల వద్ద సంయమనంతో ఉండాలి. దీర్ఘకాలికంగా కావాలనుకుంటున్న ఓ పని నెరవేరుతుంది.
ధనస్సు రాశి:
తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటారు. వ్యాపారంలో కొత్త ప్రణాళికలు ప్రారంభిస్తారు. వ్యాపారంలో స్థిరత్వం ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.
మకర రాశి:
ఈ రాశి వారు ఏపని చేపట్టినా విజయం సాధిస్తారు. వ్యాపారంలో డబ్బలు అదనంగా వస్తాయి. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఆర్థికపరంగా మంచి ఫలితాలు వస్తాయి.
కుంభరాశి:
లక్ష్యాన్ని చేరుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేరస్తారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉంటారు. కొన్ని వ్యాఖ్యలను నియంత్రణలో ఉంచుకోవాలి.
మీనరాశి:
బావోద్వేగాలకు లోనవుతారు. కొన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయి. వ్యాపారంలో లేదా కార్యాలయంలో కొత్త సమస్యలు ఎదుర్కొంటారు. ఉద్యోగులు ఆహ్లదంగా ఉంటారు.