Horoscope Today: 2024 ఏప్రిల్ 25 గురువారం రోజున ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తుల రాశి నుంచి వృశ్చిక రాశిలో సంచరించనున్నాడు. దీంతో కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. మరికొన్ని రాశుల వ్యాపారులకు లాభాలు రానున్నాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
కొన్ని పనుల నిమిత్తం ఈ రాశి వారు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ విధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో మంచిగా ఉండాలి.
వృషభ రాశి:
ఆస్తుల కొనుగోలుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులు కార్యాయాలయాల్లో ప్రశంసలు పొందుతారు. ఎక్కువగా వాదనలు చేయొద్దు. కొపాన్ని అదుపులో పెట్టుకోవాలి.
మిథునం:
కొత్త వ్యక్తులతో పర్సనల్ విషయాలు చెప్పొద్దు. ఎవరిదగ్గర అప్పు తీసుకోకుండా ఉండాలి. వ్యాపారులు కొన్ని విషయాల్లో కష్టపడాల్సి వస్తుంది. నిర్లక్ష్యంగా ఉండొద్దు.
కర్కాటకం:
కొన్ని రంగాల వారు నైపుణ్యాలు ప్రదర్శిస్తారు. ఏదైనా పొరపాటు చేస్తే వెంటనే సరిదిద్దుకుంటారు. వాహనాలపై ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.
సింహ:
ఉద్యోగులకు కార్యాలయాల్లో గొడవలు ఉండే ప్రమాదం ఉంది. పెండింగులో ఉన్న పనులు వెంటనే పూర్తి చేయాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.
కన్య:
అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. లక్ష్యం వైపు పయనిస్తారు. ఏదైనా నష్టం జరిగితే దానిని పూడ్చుకునేందుకు ప్రయత్నిస్తారు. సమాజంలో గుర్తింపు వస్తుంది.
తుల:
వ్యాపారులు సంబంధాలను మెరుగుపరుచుకుంటారు. ఇతరులకు కొన్ని సూచనలు చేస్తారు. ప్రభావవంతమైన వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. కుటంబంలో సమస్యలు ఉండే అవకాశం.
వృశ్చికం:
కొత్త పనులు చేపడుతారు. కొన్ని ప్రాజెక్టులు పూర్తి కాకపోవడంతో నిరాశతో ఉంటారు. విద్యార్థులు కెరీర్ పై ఆందోళన చెందుతారు. ఉద్యోగులు సైతం కొన్ని విషయాల్లో నిరాశతో ఉంటారు.
ధనస్సు:
ఈరాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు ఇతరుల వద్ద డబ్బు తీసుకోకుండా ఉండాలి. కొన్ని ప్రయత్నాలు విఫలం అవుతాయి. కుటుంబ విషయాల్లో సంయమనం పాటించాలి.
మకర:
ప్రణాళికతో ముందుకు వెళ్తారు. కొన్ని శుభకార్యక్రమాలకు హాజరు కావొచ్చు. అడగకుండా ఇతరులకు సలహా ఇవ్వడం మానుకోవాలి. ఎవరితోనూ ఎక్కువగా వాదనలు చేయొద్దు.
కుంభం:
ఉద్యోగులు సీనియర్ల నుంచి మద్దతు పొందుతారు. మంచి ఆలోచనతో నిర్ణయం తీసుకుంటారు. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారులకు లాభాలు ఉంటాయి.
మీనం:
అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వ్యక్తిగతంగా జీవితం బాగుంటుంది. వ్యాపారంలో అధిక లాభాలు రావడంతో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు.