Horoscope Today: 2025 మే 4 శనివారం రోజున ద్వాదశ రాశులపై పూర్వ భాద్రపద నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు కుంభ, మీన రాశిలో సంచరించనున్నాడు. అలాగే గజకేసరి యోగం వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో మార్పలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఓ రాశి వారు మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
కొత్త వ్యక్తుల గురించి పట్టించుకోవద్దు. ఇంట్లో పనులపై శ్రద్ధ చూపాలి. ఉద్యోగులుకు కార్యాలయాల్లో గౌరవం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృషభ రాశి:
కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. వాహనాలపై ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. కొందరు వ్యక్తుల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి.
మిథునం:
వ్యాపారులకు అనుకోని లాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఎక్కువగా వాగ్వాదాలు చేయొద్దు. పెద్దలు చెప్పిన బాటలో నడుచుకోవాలి.
కర్కాటకం:
ఈ రాశి వారు ఈరోజు ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో ప్రశంసలు ఉంటాయి. కొందరు తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉండాలి.
సింహ:
ఉద్యోగులు కిందిస్థాయి వారితో అప్రమత్తంగా ఉండాలి. ఓ వ్యక్తి వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని నిర్ణయాలు లాభాలు చేకూరుస్తాయి.
కన్య:
పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. విద్యార్థుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అనుకోని మార్గాల నుంచి డబ్బు వస్తుంది.
తుల:
ఈరాశి వారు ఈరోజు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. స్థిరాస్తికి సంబంధించిన వివాదాలు సమసిపోతాయి. ఉద్యోగులు సీనియర్ల మద్దతు పొంది ప్రమోషన్ అందుకుంటారు.
వృశ్చికం:
కుటుంబ సభ్యలతో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. పాత పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. పెండింగులో ఉన్న సమస్యలను పరిష్కారం చేరస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
ధనస్సు:
ఈ రాశివారి జీవితం ఈరోజు ఆహ్లదంగా కొనసాగుతుంది. వ్యాపారంలో కొత్త ప్రాజెక్టులు చేపడుతారు. కొత్త పరిచయాలు లాభిస్ాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.
మకర:
మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కొందరు మీ పనులకు ఆటంకం కలిగించే ప్రమాదం ఉంది. వ్యాపారులు పెట్టుబడు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే తీవ్రంగా నష్టపోతారు.
కుంభం:
ఆదాయ వనరులు పెరుగుతాయి. పెండింగులో ఉన్న డబ్బు వచ్చి చేరుతుంది. ఒక పని గురించి కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. అకస్మాత్తుగా డబ్బు వస్తుంది.
మీనం:
స్థిరాస్తి విషయంలో ఓ శుభవార్త వింటారు. కొత్త వ్యక్తులను నమ్మొద్దు. కోర్టు కేసులు ఉంటే పరిస్కారం అవుతాయి. ఇతరుల వివాదాల్లో తలదూర్చవద్దు.