Horoscope Today: 2024 ఏప్రిల్ 27 శనివారం రోజున ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు ధనస్సు రాశిలో సంచరించనున్నాడు. దీంతో ఓ రాశి వారికి ఆర్థిక చిక్కులు వచ్చే ప్రమాదం ఉంది. మరికొన్ని రాశుల వారు ఉల్లాసంగా ఉంటారు. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఈ రాశి వారు ఈరోజు సంతోషంగా గడుపుతారు. అయితే ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. వ్యాపారస్తులకు అనుకోని లాభాలు ఉంటాయి.
వృషభ రాశి:
ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్ పై దృష్టి పెట్టాలి. సామాజిక అంశాల్లో ఎక్కువగా పాల్గొంటారు. సంబంధాలు మెరుగుపడుతాయి.
మిథునం:
ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. కుటుంబంతో సమయం వెచ్చిస్తారు. చూట్టు ఉన్న వ్యక్తులు సాయం చేస్తారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటకం:
బంధువుల నుంచి ప్రత్యేక బహుమతి పొందుతారు. కొన్ని పనుల కారణంగా బిజీగా ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగులకు సిద్ధమవుతున్న వారు కొన్ని శుభవార్తలు వింటారు.
సింహ:
కుటుంబ సమస్యల కారణంగా ఆందోళనతో ఉంటారు. మనసులో కొత్త ఆలోచనలు వస్తాయి. ఉద్యోగులు తమ బాధ్యతలను నెరవేరుస్తారు. ఆదాయం పెరుగుతుంది.
కన్య:
ఈ రాశి వారు ఈరోజు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే అనేక చిక్కుల్లో పడుతారు. ప్రత్యర్థులను నమ్మకూడదు. ఖర్చులు పెరుగుతాయి. లక్ష్యాన్ని పూర్తి చేయడానికి కష్టపడుతారు.
తుల:
కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తిగతంగా ఉల్లాసంగా ఉంటారు. కొన్ని పనులను ఉత్సాహంగా చేస్తారు. కొత్త బంధాలు పుడుతాయి. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు.
వృశ్చికం:
ఈ రాశి వారికి ఈరోజు ఓపిక అవసరం. కొంత మంది కొత్త వ్యక్తులు కలుస్తారు. ఉద్యోగులు సీనియర్ల నుంచి మద్దతు పొందుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
ధనస్సు:
లక్ష్యాన్ని పూర్తి చేయడానికి కష్టపడాలి. ప్రియమైన వారితో సంతోషంగా ఉండాలి. ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్తారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు.
మకర:
ఓ శుభవార్త వింటారు. నిరుద్యోగులకు అవకాశాలు వస్తాయి. వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఆర్థిక విషయాల్లో ప్రయోజనకరంగా ఉంటుంది.
కుంభం:
ఉద్యోగులు బిజీ వాతావరణంలో గడుపుతారు. ఖర్చులు పెరుగుతాయి. వాటిని నియంత్రించుకోకపోతే సమస్యలు వస్తాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
మీనం:
కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. లక్ష్యాలపై అధ్యయనం చేస్తారు.