Horoscope Today: 2024 ఏప్రిల్ 15 సోమవారం రోజున ద్వాదశ రాశులపై పునర్వసు నక్షత్ర ప్రభావం ఉంటుంది. సోమవారం పుష్య నక్షత్ర ప్రభావంతో 5 రాశుల వారికి శివుడి అనుగ్రహం ఉంటుంది. మరికొన్ని రాశుల వారు నిరుత్సాహంగా ఉంటారు. ఈ నేపథ్యంలో మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులకు అనుకూల సమయం. ఉద్యోగులకు సీనియర్ల మద్దతు ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు.
వృషభ రాశి:
కొన్ని రంగాల వారు అనుకున్న విజయాలు సాధిస్తారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. స్నేహితులతో ఎక్కువ సమయం కేటాయిస్తారు.
మిథునం:
ఈ రాశి వారికి శివుడి అనుగ్రహం ఉంటుంది. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది.
కర్కాటకం:
అవకాశాలు వస్తుంటాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా విజయం సాధిస్తారు. సంబంధాలు మెరుగుపడుతాయి. విద్యార్థుల కెరీర్ కు సంబంధించిన శుభవార్త వింటారు.
సింహ:
ఈ రాశి వారికి సంతృప్తి జీవితం ఉంటుంది. వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.
కన్య:
ఈరోజు ఉల్లాసంగా గడుపుతారు. వీరికి శివపార్వతుల అనుగ్రహం ఉంటుంది. కొన్ని రంగాల వారు సమస్యలను ఎదుర్కొంటారు. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు.
తుల:
కొన్ని సమస్యలను సున్నితంగా పరిష్కరించాలి. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపాలి. కొత్త ప్రాజెక్టు మొదలు పెడితే సక్సెస్ అవుతారు.
వృశ్చికం:
ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆలోచనాత్మకంగా వ్యవహరించాలి. ఖర్చులపై నియంత్రణ ఉండాలి. మానిసకంగా ధృఢంగా ఉంటారు. శివుడి ఆరాధన వల్ల శుభాలు ఉండే అవకాశం.
ధనస్సు:
ఈ రాశి వారు అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పెండింగులో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. వీరికి శివపార్వతుల అనుగ్రహం.
మకర:
మార్కెట్లో పెట్టుబుడులు పెట్టేవారికి అనుకూల సమయం. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు సీనియర్ల మద్దతు ఉంటుంది.
కుంభం:
ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కుటుంబంతో సరదాగా ఉంటారు.డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులను కలుస్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.
మీనం:
కొన్ని పనులతో నిరుత్సాహంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. కొన్ని లక్ష్యాలను పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది.