Horoscope Today: 2024 ఏప్రిల్ 13 శనివారం రోజున ద్వాదశ రాశులపై మృగశిర నక్షత్ర ప్రభావం ఉంటుంది. శుక్రవారం స్కంధమాతకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ సందర్భంగా సందర్భంగా కన్య రాశి ఉద్యోగులకు ఖర్చులు పెరుగుతాయి. ఈ నేపథ్యంలో మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
పెండింగులో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగులు కార్యాలయంలో ప్రతిభ చూపుతారు. కొత్త పనులపై ఆసక్తి చూపుతారు. మానసిక భారం నుంచి ఉపశమనం పొందుతారు.
వృషభ రాశి:
అనుకోని ఆదాయం ఉంటుంది. దీంతో ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగులు బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
మిథునం:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యక్తిగత విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. కొన్ని శుభవార్తలు వింటారు.
కర్కాటకం:
కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు కార్యాలయంలో పని ఒత్తిడి ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్తలు పాటించాలి.
సింహ:
వైవాహిక జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి. వ్యాపారులు కొన్ని ఒప్పందాలు చేసుకుంటారు. రాజకీయ రంగంలో పనిచేసేవారికి అనుకూల వాతావరణం.
కన్య:
ఉద్యోగంలో పనితీరు కనబరుస్తారు. ఖర్చులు పెరుగుతాయి. బడ్జెట్ ను రూపొందించుకొని దానికి అనుగుణంగా పనిచేయాలి. వ్యాపారులు రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది.
తుల:
ఈ రాశివారికి అనేక రంగాల్లో శుభఫలితాలు ఉంటాయి. ఎవరికైనా వాగ్దానం చేస్తే దానిని నెరవేరుస్తారు. వ్యక్తిగత విషయాల్లో విజయం సాధిస్తారు.
వృశ్చికం:
కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. తప్పుడు నిర్ణయం తీసుకోకూడదు. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. వాదనలకు దిగొద్దు.
ధనస్సు:
పెండింగులో ఉన్న పనులు పూర్తి చేస్తారు. కొత్త పరిచయాలతో మరింత ప్రయోజనాలు ఉంటాయి. పెద్దలతో మాట్లాడడం వల్ల కొన్ని పనులు సక్సెస్ అవుతాయి.
మకర:
కుటుంబ సంబంధాలు మెరుగుపడుతాయి. ఆదాయం వచ్చినా ఖర్చు పెరుగుతుంది. గతంలో చేసిన తప్పుల నుంచి గుణపాఠం పొందుతారు. ప్రశాంతంగా ఉంటారు.
కుంభం:
వ్యాపార ప్రణాళికలు సక్సెస్ అవుతాయి. కొన్ని శుభవార్తలు వింటారు. ఉద్యోగులు ప్రతిభ కనబరుస్తారు. కొత్త వ్యక్తులను కలుస్తారు. ఎక్కువగా వాదనలు చేయొద్దు.
మీనం:
నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారంపై దృష్టి పెట్టాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో నియంత్రణ ఉండాలి. ఖర్చులు పెరగడం వల్ల ఆందోళన చెందుతారు.