Horoscope:2024 ఉగాదికొ కొత్త పంచాంగం ప్రకారం జ్యోతిష్యం చెబుతారు. ఈ శాస్త్రం ప్రకారం ఈ ఏడాది మే నెల ఒకటో తేదీన గురుడు మేష రాశి నుంచి వృషభ రాశిలోకి వెళ్లనున్నాడు. ఈ గ్రహం మార్పు కొన్ని రాశులపై ప్రభావం చూపేనుంది. దీంతో ఆయా రాశులు కలిగిన జీవితాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇంతకాలం వారి జీవితాల్లో ఉన్న కష్టాలు తొలగిపోయిన శుభయోగం కలగనుంది. మరికొందరికి కష్టాలు రానున్నాయి. ఇంతకీ ఎన్ని రాశులపై ఈ ప్రభావం పడనుంది. ఆ రాశులు ఏవీ?
మేషరాశి: బృహస్పది గ్రహం మార్పు మేష రాశిపై పడనుంది. దీంతో ఈ రాశి వారు జీవితంలో ఎప్పుడూ చూడని లాభాలు పొందుతారు. ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయి. వ్యాపారులకు అనుకోని లాభాల వస్తాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. వైవాహిక జీవితం బాగుంటుంది. అయతే కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది.
వృషభరాశి: ఈ రావారికి మే 1 నుంచి ఆదాయం వరదలా వస్తుంది. వీరు ఎక్కువగా శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు చేపడుతారు. కుటుంబ వాతావరణం కాస్త ఆహ్లాదంగా ఉన్నా కొన్ని విషయాల్లో మనస్పర్థలు వస్తాయి. అందువల్ల ఎటువంటి వాదనలకు దిగకుండా ఉండాలి.
కర్కాటక రాశి: గురు గ్రహం మార్పు వల్ల కర్కాటక రాశి వారికి శుభ ఫలితాలు జరగనున్నాయి. ఉద్యోగం కోసం ఎదురుచూసేవారికి శుభవార్తలు వింటారు. ఆదాయం పెరుగుతుంది. కానీ ఖర్చులు పెరుగుతాయి. కొన్ని పెట్టుబడుల్లో ఇతరుల సలహాలు తీసుకోవాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు.
సింహరాశి:ఈ రాశి వారికి గతంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. రుణాల విషయంలో విముక్తి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. వైవాహిక జీవితంలో మార్పులు వస్తాయి. తీర్థయాత్రలకు ప్లాన్ చేస్తారు. కొన్ని విషయాల్లో కొత్త వ్యక్తులకు దూరంగా ఉంటే మంచిది.