
ఒలింపిక్స్ మహిళ హాకీ జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఫూల్-ఏ మ్యాచ్ లో భారత మహిళా జట్టు 4-3 తేడాతో గెలిచింది. భారత జట్టులో వందన కటారియా మూడు గోల్స్ చేసి భారత్ కు తిరుగులేని ఆధిక్యాన్ని అందించింది. అలాగే నేహా ఒక గోల్ చేసింది. నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్ లో ప్రత్యర్థి దక్షాణాఫ్రికా చివరి వరకు భారత్ కు గట్టిపోటీ ఇచ్చింది. ఈ విజయంతో రాణిరాంపాల్ సారథ్యంలోని భారత్ జట్టు క్వార్టర్ ఫైనల్ ఆశలు సజీవంగా ఉంచుకుంది.