
దేవరయాంజల్ భూముల సర్వేపై ఐఏఎస్ ల కమిటీ ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. జీవో 1014 అమలు నిలిపివేసేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఆలయ భూముల గుర్తింపునకు విచారణ చేస్తే ఇబ్బందేంటి.. ప్రభుత్వ, ఆలయ భూములను గుర్తించకూడదా అని పిటిషనర్ సదాకేశరెడ్డిని న్యాయస్థానం ప్రశ్నించింది. కబ్జాదారులను ఆక్రమణలు చేసుకోనీయాలా అని ఘాటుగా వ్యాఖ్యానించింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వడం కమిటీ బాధ్యత అని తెలిపింది.