Heinrich Klaasen: సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్, విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కొలు పలికారు. 33 ఏళ్ల వయసులోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దక్షిణాఫ్రికా తరఫున 60 వన్డేలు, 58 టీ20లు, 4 టెస్టులు ఆడగా 4వన్డే సెంచరీలతో సహా అన్ని ఫార్మాట్ల లో కలిపి 3245 పరుగులు చేశాడు. కాగా క్లాసెన్ ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.