
కృష్ణా జిల్లాలోని గొల్లపూడిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిశ యాప్ ఆవిష్కరణకు విచ్చేశారు. దీంతో కిలోమీటర్ల మేర హైవే మీద వాహనాలు నిలిచిపోయాయి. ముందుకు వెళ్లలేక.. వెనక్కి వెళ్లలేక ద్విచక్ర వాహనదారులు ఎండలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.